బిగ్ బాస్ హౌస్ మెట్స్ కు పెన్సిల్ పార్థసారధి ఇచ్చిన క్యారెక్టర్లు ఇవే
బిగ్ బాస్ షో 49 ఎపిసోడ్లని విజయవంతంగా పూర్తి చేసుకుని ఆదివారం 50వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈ 50వ ఎపిసోడ్ గ్రాండ్ గా ఉండాలని కింగ్ నాగార్జున ఓ ప్రత్యేక అతిథిని ఇంట్లోకి తీసుకొచ్చారు. అంతకంటే ముందు ఈ యాభై ఎపిసోడ్లు ఇంటి సభ్యులు ఎలా గడిపారనేది ఓ వీడియో ద్వారా చూపించారు. దీంతో అందరూ బాగా ఎమోషనల్ అయ్యారు. ఇక వారి ఎమోషన్ ని తగ్గించడానికి నాగార్జున ‘గ్యాంగ్ లీడర్’ నానీని స్టేజి మీదకి తీసుకొచ్చారు.
అయితే నానీలా కాకుండా సినిమాలోని పాత్ర పెన్సిల్ పార్థసారధిగా ఇంటి సభ్యులకు నాగార్జున పరిచయం చేశారు. ఇంటి సభ్యులు ఒక్కొక్కరిగా పెన్సిల్ కి పరిచయం చేసుకోండని చెప్పారు. అలాగే నాని తాను ఒక స్క్రిప్ట్ అనుకొని అందులోని ఒక్కో పాత్రను ఒక్కో హౌస్ మేట్ కి ఇచ్చేశారు. అందులో మొదటిగా బాబా భాస్కర్ కు పాట మధ్యలో వచ్చే క్యామియో రోల్ ఇవ్వగా - శిల్పా చక్రవర్తికు ఇంటెర్వెల్ కి ముందు ఎంట్రీ ఇచ్చి ట్విస్ట్ ఇచ్చే క్యారెక్టర్ ఇచ్చారు.
అలాగే హిమజకు అండర్ డాగ్ రోల్.. మెల్లగా స్టార్ట్ అయ్యి ఆ తరవాత ఒక గ్రూపునే భయపెట్టే క్యారెక్టర్. ఇక శివజ్యోతికి పల్లెటూరు నుంచి వచ్చి అక్కడున్న ఇన్నోసెన్స్ ను స్ప్రెడ్ చేసే రోల్. అలీ రెజా - సడెన్‌గా కోపం వచ్చే క్యారెక్టర్ - శ్రీముఖి - సౌండ్ - రీసౌండ్ ఉన్న రోల్. ఇక రవికృష్ణకు ఇన్నోసెంట్ గా ఉంటూ సినిమా ఆఖర్లో విలన్ వెనక నుంచి వచ్చే రోల్. మహేష్ - చిత్తూరు యాసలో మంచి కామెడీ ఉన్న రోల్ - రాహుల్ - పులిహోర రాజా రోల్స్ ఇచ్చారు.
ఇక ఉయ్యాలా జంపాలా అంటూ పునర్నవిని - సిసింద్రీలా ఎంటర్ అయ్యి ఆటమ్ బాంబులా పేలే రోల్ - వితికా - ఇంట్లో వాళ్లందరినీ బాగా వాడేసుకుంటున్న ఒక కోడలు రోల్ - వరుణ్ సందేశ్ - ఫరెవర్ ప్రేమికుడు.
ఇలా అందరికీ క్యారెక్టర్లు ఇచ్చేసిన నానీ...ఇంటి సభ్యులకు ‘గ్యాంగ్ లీడర్’ ట్రైలర్ చూపించారు. ఆ ట్రైలర్ చూసిన వారు చాలా బాగుందని చెప్పి...నానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అటు నాగార్జున ట్రైలర్ లో రొమాన్స్ కనపడలేదని అడిగితే...అది సినిమాలో ఉందని నాని సరదాగా సమాధానమిచ్చాడు.