ఒక్క భారీ సినిమా తన రిలీజ్ డేట్ ని మార్చుకుంటే మిగిలిన హీరోల విడుదలలు ఎంత ఇబ్బందిలో పడతాయో సాహో ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. అందుకే హింది చిచోరే తమిళ్ కాప్పన్ (తెలుగు బందోబస్త్)లాంటి సినిమాలు ముందస్తు ప్లానింగ్ ఉన్నా కూడా కేవలం సాహో కోసం డేట్లు మార్చుకోవాల్సి వచ్చింది. నాని గ్యాంగ్ లీడర్ కు సైతం ఇదే సమస్య ఉంది.
చాలా రోజుల క్రితమే నాని గ్యాంగ్ లీడర్ రిలీజ్ ఆగస్ట్ 30 అని మైత్రి సంస్థ ప్రకటించింది. తీరా సాహో అదే తేదికి షిఫ్ట్ కావడంతో ఏం చేయాలనే ఆలోచనలో తలమునకలై ఉంది. వాయిదా వేయడం అయితే తప్పదు. పంతానికి పోయి సాహోతో డీ కొంటే ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించడం ఖాయం. అందుకే గత కొద్దిరోజులుగా దీని గురించి ఎటూ తేల్చుకోలేక గ్యాంగ్ లీడర్ టీం సతమవుతున్నట్టు టాక్
ఇన్ సైడ్ టాక్ ప్రకారం నాని గ్యాంగ్ లీడర్ సెప్టెంబర్ 12 లేదా 13న వచ్చే ఆలోచనలో ఉంది. కానీ అప్పటికే వరుణ్ తేజ్ వాల్మీకి దాన్ని లాక్ చేసుకుంది. పోటీ చేయడం తప్పేమి కాదు కానీ మిగిలిన నెలలతో పోలిస్తే కాస్త డ్రైగా ఉండే సెప్టెంబర్ లో క్లాష్ అవ్వడం ఎవరికైనా ఓపెనింగ్స్ పరంగా అంత సేఫ్ కాదు. అందుకే మైత్రి వాళ్ళు ఓ కంక్లూజన్ కు రాలేకపోతున్నట్టు తెలిసింది.
ఎంత మాట్లాడుకున్నా వేరే ఆప్షన్ కూడా లేదు. ఒకవేళ అక్టోబర్ కు వెళదామంటే అప్పుడు సైరాతో పాటు వెంకీ మామ సిద్ధంగా ఉంటారు. అది ఇంకా డేంజర్. చావో రేవో సెప్టెంబర్ లోనే తేల్చుకోవాలి. పోనీ 20 అనుకున్నా సూర్య బందోబస్త్ సిద్ధంగా ఉంది. ఎలా చూసుకున్న న్యాచురల్ స్టార్ మెగా ప్రిన్స్ ల మధ్య క్లాష్ తప్పేలా లేదు. అధికారిక ప్రకటన వచ్చాకే క్లారిటీ వస్తుంది