ఏడాది వెనక్కి వెళ్తే.. అప్పటికి నాని రేంజికి అతడి సినిమా అమెరికాలో హాఫ్ మిలియన్ డాలర్లు వసూలు చేసినా చాలా గొప్ప విషయమే. ‘భలే భలే మగాడివోయ్’ మీద మంచి బజ్ ఉన్నా.. ఆ సినిమా అక్కడ ఆ మార్కు అందుకుంటుందా అని సందేహించారు చాలా మంది. కానీ ‘భలే భలే..’ అనూహ్యంగా దానికి మూడింతలు వసూలు చేసి సంచలనం సృష్టించింది. కొందరు స్టార్ హీరోలకు సైతం మిలియన్ మార్కు అన్నది కష్టసాధ్యంగా ఉంటే.. నాని సినిమా 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ ఊపులో నాని తర్వాతి సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ కూడా అమెరికాలో బాగానే పెర్ఫామ్ చేసింది. ఐతే ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ చూసి.. ఇది ఈజీగా మిలియన్ మార్కు దాటేస్తుందనుకున్నారు. కానీ అది 8 లక్షల డాలర్లకు కాస్త పైన వసూలు చేసి ఆగిపోయింది.
నాని లేటెస్ట్ మూవీ ‘జెంటిల్ మన్’కు సైతం అమెరికాలో మంచి ఓపెనింగ్సే వచ్చాయి. కానీ ఫస్ట్ వీకెండ్ తర్వాత కలెక్షన్లు పడిపోయాయి. తొలి వారాంతంలోనే హాఫ్ మిలియన్ మార్కును అందుకున్నా.. ఆ తర్వాత బండి బాగా స్లో అయిపోయింది. దీంతో 7-8 లక్షల డాలర్ల మధ్య ‘జెంటిల్ మన్’ ఆగిపోతుందని భావించారు. ఐతే తర్వాతి వారం వచ్చిన ‘ఒక మనసు’ నిరాశ పరచడం.. మిగతా సినిమాలు సోదిలో లేకపోవడంతో ‘జెంటిల్ మన్’కు బాగానే కలిసొస్తోంది. పైగా టికెట్ ధరలు కూడా తగ్గించడం కలిసొచ్చింది. రెండో వారం కూడా ఈ సినిమా 70 లొకేషన్లలో ఆడుతోంది. ప్రస్తుతం ‘జెంటిల్ మన్’ వసూళ్లు 8 లక్షల డాలర్లకు చేరువలో ఉన్నాయి. వచ్చే రెండు వారాలు కూడా మరీ పెద్ద సినిమాలేమీ లేవు కాబట్టి.. ‘జెంటిల్ మన్’ జోరు కొనసాగే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ సినిమా మిలియన్ మార్కును టచ్ చేస్తే ఆశ్చర్యమేమీ లేదు. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’కు ఊరించి ఊరించి ఉస్సూరుమనిపించిన మిలియన్ మార్కు ఈసారి మాత్రం నానికి చిక్కేలాగే ఉంది.