సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన రిపబ్లిక్ మూవీ విడుదలకు సిద్దం అయ్యింది. అక్టోబర్ 1న థియేటర్ల ద్వారా విడుదల కాబోతున్న రిపబ్లిక్ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇండస్ట్రీ వర్గాల వారు పలువురు మీడియా ముందుకు వచ్చి తమ శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా పై యంగ్ హీరో నాని స్పందించాడు. సినిమా ను చూశాను చాలా బాగుంది అంటూ తన అభిప్రాయంను వెళ్లడించాడు. రిపబ్లిక్ మూవీ ఒక మంచి మెసేజ్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ తో చక్కగా ఉంటుందని ముందు నుండే యూనిట్ సభ్యులు చెబుతున్నారు. తాజాగా రిపబ్లిక్ మూవీ ప్రత్యేక షో చూసిన సెలబ్రెటీలు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
నాని ట్విట్టర్ లో... రిపబ్లిక్ మూవీ చూశాను. అతడి చుట్టు ఉన్న వారి పట్ల దయ చూపిస్తూ ఉండటం వల్ల ఆ ప్రార్థనల రూపంలో తిరిగి వచ్చింది. రిపబ్లిక్ మూవీ రూపంలో అది క్లీయర్ గా కనిపిస్తుంది. ఇది దేవ కట్ట మార్క్ సినిమా అన్నట్లుగా ఉంది. అతడు మళ్లీ పుంజుకున్నట్లుగా కనిపిస్తున్నాడు. చిత్ర యూనిట్ సభ్యులు మరియు సాంకేతిక నిపుణులు అందరికి కూడా నాని శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సినిమాలో రమ్య కృష్ణ కీలక పాత్రలో నటించింది. ఆమె పాత్ర ఎంత కీలకమో సినిమా ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ఖచ్చితంగా వసూళ్ల పరంగా కూడా మంచి పాజిటివిటీని అందరిలో కలిగిస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నాయి.
సాయి ధరమ్ తేజ్ కు జోడీగా ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది. ఈ సినిమా లో సాయి ధరమ్ తేజ్ కలెక్టర్ గా కనిపించబోతున్నాడు. మన ప్రజాస్వామ్యంలో మూడు వ్యవస్థలు సమానంగా నడిస్తేనే అంతా బాగుంటుంది. అందులో ఏ ఒక్క వ్యవస్థ తప్పినా కూడా ఇతర రెండు వ్యవస్థలు బాగు చేయాల్సి ఉంటుంది అంటూ ఈ సినిమాలో చూపించబోతున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా పై జోరుగా చర్చ జరుగుతోంది. సినిమా చిత్రీకరణ మొదలు పెట్టినప్పటి నుండే అంచనాలు భారీగా ఉన్నాయి. మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందా అనేది మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది.