నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `శ్యామ్ సింగరాయ్` డిసెంబర్ 24న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే లిరికల్ సింగిల్స్ ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు.. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఒక్క ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పీక్స్ కి తీసుకెళ్లింది. శ్యామ్ సింగరాయ్ రోటీన్ సినిమాలకు భిన్నంగా ఉందని తెలుస్తోంది. దీంతో సినిమాకు మరింత బజ్ క్రియేట్ అవుతోంది. రిలీజ్ వరకూ అదే టెంపోని కొనసాగించాలని యూనిట్ ప్రచార కార్యక్రమాల్ని గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
దీనిలో భాగంగా నాని ఫ్యాన్స్ ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. 3000 మంది ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి రెడీ అయ్యారు. అభిమాన సంఘాలకు టచ్ లో ఉంటూ ఈవెంట్ ని ఎలా? నిర్వహించాలి అన్న దానిపై గట్టిగానే ప్లానింగ్ జరుగుతోంది. రెండు తెలుగు రాష్ర్టాల నుంచి 3000 మంది అభిమానుల్ని నాని మీట్ అవ్వబోతున్నారుట.
ఈ కార్యక్రమం నవంబర్ 28న హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ఏర్పాటు చేసారు. ఫ్యాన్స్ అందరికీ ప్రత్యేకంగా లంచ్ పార్టీ కూడా ఏర్పాటు చేసారుట. ఇప్పటివరకూ నాని కేవలం స్టూడెంట్స్ తో మాత్రమే ఇలా ఇంటరాక్ట్ అయ్యారు. కానీ ఈసారి అభిమాన సంఘాల్ని దించడం అంతటా చర్చకొస్తుంది.
మరి దీని వెనుక అసలు రహస్యం ఏంటి? కొవిడ్ సమయంలో నాని చేసిన వ్యాఖ్యలు కారణంగా డిస్ర్టిబ్యూటర్లు..ఎగ్జిబిటర్లు తన సినిమాల్ని బ్యాన్ చేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాని రియలైజ్ అవ్వడంతో అక్కడితో ఆ ఎపిసోడ్ కూల్ గా ముగిసింది. మరి ఇప్పుడు హీరోగా తన బలం నిరూపించుకునేందుకు ఇలా అభిమాన సంఘాల్ని రంగంలోకి దించుతున్నారా? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి.