నాని కళ్ళు మూసుకుంటే ఏమైందంటే...

Update: 2016-08-23 08:49 GMT
''కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకే చేరావే.. తనివితీరా చూద్దామంటే పారిపోతావే'' అంటున్నాడు యంగ్ హీరో నాని. ఇంతకీ ఏంటిందంతా అనుకుంటున్నారా.. ఇప్పుడు చాలామంది యంగ్ హీరోలతో పాటు నాని కూడా తన సందడి మొదలెట్టేశాడు. నేను మాత్రం ఏమన్నా తక్కువ తిన్నానా అన్నట్లు అప్పుడే ప్రమోషన్లు షురూ చేశాడు.

ఈ ఏడాది ఆల్రెడీ రెండు సినిమాలతో ఊల్లాసపరిచిన నాని.. ఇప్పుడు మూడో సినిమాతో కూడా రెడీ అయిపోతున్నాడు. విరించి వర్మ డైరక్షన్లో రూపొందిన ఆ సినిమా పేరే ''మజ్నూ''. అయితే సెప్టెంబర్ లో ఇప్పటికే జనతా గ్యారేజ్ - ప్రేమమ్ - ఇంకొక్కడు - ఈడు గోల్డ్ ఏహా.. సినిమాలు రిలీజుకు లైనప్ అవ్వడంతో నాని తన సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో ఇంకా ఒక నిర్ధారణకు రాలేదట. కాకపోతే సంగీత దర్శకుడు గోపి సుందర్ కంపోజ్ చేసిన పాటలను మాత్రం యుట్యూబ్ ద్వారా రిలీజ్ చేస్తున్నాడు. అలా వచ్చిన ఒకపాటే ఈ 'కళ్ళు మూసి తెరిచేలోపే' అంటూ సాగే మెలోడీ. ఒక్కసారి వినగానే వినసొంపుగా అనిపించడమే కాదు.. ఫుల్లుగా రొమాంటిక్ కిక్ ఇచ్చేస్తోంది ఈ పాట.

ఈ సినిమాలో నాని సరసన అనూ ఇమానుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది రెండు సినిమాలతో వచ్చిన నాని రెండింటిలోనూ ఎక్కువగా కామెడీ పైనే ఫోకస్ చేశాడు. అయితే ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయి రొమాంటిక్ కామెడీతో వస్తున్నాడట. అది సంగతి.
Full View

Tags:    

Similar News