నాచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ' విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 19న జెర్సీ విడుదల కాబోతుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ చిత్రం పూర్తిగా క్రికెట్ నేపథ్యంలో అని తేలిపోయింది. అయితే రెండు వారాల క్రితం వచ్చిన 'మజిలీ' చిత్రం కూడా క్రికెట్ నేపథ్యంలో రూపొందిందే అవ్వడంతో రెండు సినిమాలకు చాలా సారుప్యత ఉంటుందని అంటున్నారు. రెండు సినిమాల్లో కూడా మొదట హీరోలు కెరీర్ లో ఫెయిల్ అయ్యి, ఆతర్వాత మళ్లీ విజయాన్ని సాధించినట్లుగా కథ ఉంది. దాంతో 'జెర్సీ' చిత్రంపై మజిలీ ప్రభావం పడే అవకాశం ఉందేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రెండు ఒకే నేపథ్యంలోని సినిమాల్లో ఏది ముందు వచ్చి పాజిటివ్ టాక్ దక్కించుకుంటే దానికే ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మజిలీ వచ్చి రెండు వారాలవ్వడంతో పాటు, సూపర్ హిట్ టాక్ ను దక్కించుకుంది. దాంతో జెర్సీ ఫలితంపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు సేమ్ ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై తాజాగా నాని ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ... మజిలీ సినిమాను నేను మొదటి రోజే చూడాలనుకున్నాను. నాకు నిన్ను కోరి వంటి సక్సెస్ ఇచ్చిన శివ నిర్వాన తప్పకుండా మంచి సినిమా చేస్తాడని నాకు తెలుసు. కాని జెర్సీ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉండటం వల్ల నేను మజిలీ చూడలేక పోయాను.
చూడని సినిమా గురించి, ఆ సినిమాలోని కథ గురించి నేను ఏమీ మాట్లాడలేను అంటూ చెప్పుకొచ్చాడు. మజిలీ చిత్రం గురించి తాను ఇప్పుడేం మాట్లాడను అని, ప్రస్తుతం తన దృష్టి మొత్తం జెర్సీ పైనే ఉందని నాని అన్నాడు. మరో అయిదు రోజుల్లో రాబోతున్న ఈ చిత్రంపై నాని చాలా ఆశలే పెట్టుకున్నట్లుగా ఉన్నాడు. చాలా కష్టపడి క్రికెటర్ గా నాని ఈ చిత్రంలో నటించాడు. క్రికెట్ ఆడుతున్న సమయంలో గాయాలు కూడా అయ్యాయి. గత చిత్రాలతో పోల్చితే నాని ఈ చిత్రంలో భిన్నంగా ఒక పిల్లాడికి తండ్రిగా నటించాడు. దాంతో సినీ వర్గాల్లో కూడా ఆసక్తి ఉంది. మరి మజిలీ ప్రభావం లేకుండా జెర్సీ ఏమేరకు సక్సెస్ అవుతుందనేది విడుదలైతే కాని తెలియదు.