దర్శకులు కొంచెం స్టార్ స్టేటస్ సాధించడం ఆలస్యం.. స్టార్ హీరోల వైపే చూస్తారు. తమ కథలకు నప్పే మంచి నటులు అందుబాటులో ఉన్నప్పటికీ.. టాలెంటుతో సంబంధం లేకుండా స్టార్లతోనే పని చేయాలని చూస్తారు. హీరోలకు మార్కెట్ పరిధి ఎక్కువుండాలి.. తాము అనుకున్నంత బడ్జెట్లో సినిమాలు చేసుకోగలిగే స్వేచ్ఛ ఉండాలి. అందుకే ఎంతో టాలెంట్ ఉన్న దర్శకులు కూడా స్టార్లు.. వారసుల మీదే ఫోకస్ పెడుతుంటారు. అలాంటి స్టార్ దర్శకులకు నాని లాంటి టాలెంటెడ్ యాక్టర్ కనిపించట్లేదు. నిజానికి గత కొన్నేళ్లలో నాని అంచెలంచెలుగా ఎదిగాడు. చిన్న రేంజి స్టార్ హీరో అయిపోయాడు. అతడి లేటెస్ట్ మూవీ ‘నేను లోకల్’ రూ.30 కోట్ల షేర్ సాధించి సంచలనం సృష్టించింది.
నాని సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే రూ.30 కోట్లు గ్యారెంటీ అన్న అభిప్రాయం బలపడిపోయింది. అయినప్పటికీ కూడా స్టార్ డైరెక్టర్లు ఎవ్వరూ కూడా ఇంకా అతడి వైపు చూడకపోవడం ఆశ్చర్యమే. అలాగని నాని ఏమైనా వాళ్ల కోసం వెంపర్లాడుతున్నాడా అంటే అలాగేమీ కాదు. వాళ్లు నాతో సినిమాలు చేయకపోతే ఏంటి అన్నట్లుగా.. తనదైన శైలిలో వైవిధ్యమైన కథలతో తనను సంప్రదిస్తున్న యంగ్ డైరెక్టర్ల వైపే చూస్తున్నాడతను. ‘నేను లోకల్’ తర్వాత నెక్స్ట్ ఏంటి అనుకుంటుంటే.. ఒకటిని నాలుగు ప్రాజెక్టులు లైన్లో పెట్టాడు నాని. అతను పని చేస్తున్న దర్శకులందరూ దాదాపుగా యువకులే. స్టార్ స్టేటస్ లేని వాళ్లే. మరి స్టార్ డైరెక్టర్లకు నాని ఇంకెప్పుడు కనిపిస్తాడు.. వాళ్లతో పని చేయాలని నాని ఎప్పుడు ప్రయత్నిస్తాడు?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/