104 డిగ్రీల జ్వరంలోనూ చిరంజీవి ఆ పని చేశాడు!

Update: 2020-05-08 12:10 GMT
సినిమాలంటే కొందరికి పిచ్చి. ఆ వ్యామోహం ఉంటే గొప్ప స్టార్లుగా ఎదుగుతారు. మెగా స్టార్ చిరంజీవికి అంతే. అందుకే టాలీవుడ్ టాప్ హీరో అయ్యాడు. చిరంజీవికి కమిట్ మెంట్ ఎక్కువ అని.. ఎదైనా అనుకున్నదంటే జరిగి తీరాల్సిందేనన్న పట్టుదల ప్రదర్శిస్తాడని ఆయన గురించి తెలిసిన వారు చెబుతారు.

తాజాగా చిరంజీవి కమిట్ మెంట్ గురించి నేచురల్ స్టార్ నాని చెప్పుకొచ్చాడు. చిరంజీవి నటించిన ‘జగదేక వీరుడు-అతిలోక సుందరి’ సినిమా విషయంలో ఓ ఘటనను నాని పంచుకున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ సమయంలో చిరంజీవికి బాగా జ్వరం మొచ్చిందట.. ఏకంగా 104 డిగ్రీల జ్వరంతో ఒళ్లు కాలిపోతోందట.. అయినా కూడా తన కోసం షూటింగ్ వాయిదా పడొద్దని..డేట్స్ పాడవుతాయని.. వాహిని స్టూడియోలో వేసిన సెట్ కు వచ్చి మరీ జ్వరంలో డ్యాన్స్ చేశాడట చిరు.

ఆ పాటలో చేయకపోతే శ్రీదేవి హిందీ సినిమా చిత్రీకరణ కోసం వెళ్లిపోతుందని.. డేట్స్ కష్టమని తెలిసి నిర్మాతకు నష్టం వస్తుందని.. చిరంజీవి 104 డిగ్రీల జ్వరం బాధిస్తున్నా ఎంతో ఉత్సాహంతో ఆ పాటకు స్టెప్పులేశాడట..

‘దినక్కుతా దినక్కురో’ పాటలో ఎంతో ఊపుతో చేసిన చిరును చూశాం. కానీ ఆ టైంలో చిరుకు అంత జ్వరంలోనూ కనపడకుండా చేసిన తీరు నిజంగా ప్రశంసనీయమే. చిరు కమిట్ మెంట్ కు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని హీరో నాని ఈ సినిమా గురించి.. చిరంజీవి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. సెట్ లో డాక్టర్ ను పెట్టుకొని మరీ చిరంజీవి ఈ పాట షూటింగ్ లో పాల్గొన్నాడట.. అందుకే ఆ సినిమా టైంకు విడుదల చేశామని నిర్మాత అశ్వినీదత్ కూడా తెలిపాడు.
Tags:    

Similar News