తప్పంతా కీర్తిదే అంటున్న నాని

Update: 2017-01-30 09:37 GMT
డిసెంబరు 23నే రావాల్సిన సినిమా ‘నేను లోకల్’. అనుకున్న తేదీకి వచ్చేసి ఉంటే.. సినిమా ఆడేసి ఉంటే.. ఒకే ఏడాది నాలుగు విజయాలతో నాని ప్రత్యేకమైన కేటగిరిలో చేరేవాడు. కానీ ‘నేను లోకల్’ అనుకోకుండా వాయిదా పడిపోయింది. సూర్య సినిమా డిసెంబరు 23కు ఫిక్సవడం వల్లే ఈ సినిమా వాయిదా పడ్డట్లుగా ప్రచారం జరిగింది కానీ.. ఆ సినిమా ఆ తేదీకి రాకున్నా ‘నేను లోకల్’ విడుదల కాలేదంటే కారణం ఇంకేదో ఉందని అర్థమైంది. అనుకున్న తేదీ కంటే దాదాపు 40 రోజులు లేటుగా ఫిబ్రవరి 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతకీ ‘నేను లోకల్’ వాయిదా పడటానికి కారణం ఏంటి అన్నది ఎవరికీ అర్థం కాలేదు.

ఈ విషయంలో నాని క్లారిటీ ఇచ్చాడు. సినిమా ఆలస్యం కావడానికి హీరోయిన్ కీర్తి సురేషే కారణమని చెప్పాడు. కీర్తి తమిళంలో స్టార్ హీరోల సరసన వరుసగా సినిమాలు చేస్తుండటంతో ఆమె డేట్ల విషయంలో ఇబ్బందులు తలెత్తాయని.. ఆమె కోసమే కొన్నాళ్ల పాటు షూటింగ్ ఆపాల్సి వచ్చిందని చెప్పాడు. ఐతే కీర్తి వల్ల ఆలస్యమైనప్పటికీ.. ఆమె ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నాని చెప్పాడు. తాను పని చేసిన హీరోయిన్లలో బెస్ట్ అనదగ్గ వాళ్లలో కీర్తి ఒకరని నాని చెప్పాడు. ఆల్రెడీ ‘నేను శైలజ’తో టాలీవుడ్లోకి సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి.. ‘నేను లోకల్’ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా చేయబోతుండటం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News