నాగ్ సార్ వన్నీ చెడు లక్షణాలే: నాని

Update: 2018-09-26 13:37 GMT
అక్కినేని నాగార్జున - నాని లు కలిసి నటించిన మల్టిస్టారర్ 'దేవదాస్' రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. రెగ్యులర్ ప్రమోషన్స్ తో పాటు రీసెంట్ గా నాగార్జున నని గురించి షేర్ చేసిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో నాగార్జున తన సహనటుడు నానికి ఉన్న ఫోన్ అడిక్షన్ గురించి పంచ్ లు విసిరాడు.

మరోవైపు నాని కూడా తక్కువేమీ తినలేదు. నాగార్జున సార్లో ఉండేవన్నీ చెడు లక్షణాలేనని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు.  అదెలా.. అని అడిగితే.. "నాగ్ సార్ మరీ పొద్దున్నే లేస్తారు. అన్నీ టైం అంటే టైమే.. షూటింగ్ కి రావడం అయినా.. లంచ్ అయినా పక్కా టైం ప్రకారం ఉంటాయి. ఇక షూటింగ్ ప్యాకప్  చెప్పగానే ఇంటికి వెళ్లిపోతారు. ఫ్యామిలీ కి టైం కేటాయిస్తారు. అలా అని ఎంజాయ్ చేయకుండా ఉంటారని కాదు.. బయట కూడా ఫుల్ ఎంజాయ్ మెంట్. ఇక షూటింగ్ ను కూడా ఎంజాయ్ చేస్తారు. వచ్చే ఏడాది చివర్లో ఎక్కడికి హాలిడేకి వెళ్ళాలనేది ఇప్పుడే ప్లాన్ చేసుకొని ఉంటారు. ఇవన్నీ చెడు లక్షణాలే కదా" అని తేల్చాడు.

నాని గారు చెప్పినవన్నీ చూస్తుంటే అక్కినేని వారు ఫుల్ ఆర్గనైజ్డ్ అండ్ డిసిప్లిన్డ్ అన్నమాట.. మరి అంత ప్లానింగ్ తట్టుకోవడం సాధారణమైన మనుషులకు కష్టమే. అందుకేనేమో.. దేవదాస్ ఈవెంట్ లో అక్కినేని వారు డైరెక్టర్ ను లేజీ అని.. పొద్దున్నే షూటింగ్ లొకేషన్ కు రాడని చురకలు అంటించింది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News