పిల్లలు చూస్తున్నారు.. బాధ్యత లేదా?

Update: 2018-03-27 14:02 GMT
ఓ నాలుగు రోజులుగా మీడియా.. సోషల్ మీడియా.. సినిమా ఇండస్ట్రీలో ఒక అంశం గురించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఓ ఛానల్ లో జరిగిన లైవ్ డిబేట్ సందర్భంగా.. సినిమా రంగానికి చెందిన మహిళలపై ఆ ఛానల్ ప్రతినిధి చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు వివాదానికి కారణం కాగా.. వాటిపై పోలీసు కేసు నమోదు అయింది కూడా.

ఇదే అంశాన్ని పట్టుకుని ఇతర ఛానళ్లు పలువురిని లైవ్ డిబేట్స్ చేయడం.. నోటికి వచ్చినట్లుగా వాళ్లతో తిట్టించడం లాంటివి చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఆ వీడియో క్లిప్పింగ్ ను విపరీతంగా స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. మీడియా అనుసరిస్తున్న ఈ ధోరణి.. హీరో నానికి విసుగు తెప్పించింది. ఇదంతా ఇప్పటితరం పిల్లలను తప్పుదోవ పట్టిస్తుందనే అభిప్రాయం కలిగించింది. అందుకే ఈ అంశాన్ని ఇక వదిలిపెట్టాలని అంటూ.. ఓ పెద్ద ట్వీట్ పెట్టాడు నాని.

'టీవీ ఛానల్స్.. వాటి వ్యాఖ్యాతలు.. కొన్ని యూట్యూబ్ ఛానల్స్.. కొంత కాలగా సినిమా ఇండస్ట్రీనే టార్గెట్ చేస్తుండడాన్ని ఖండిస్తున్నాయి. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మన మీడియా కీలక పాత్ర పోషించాల్సి ఉంది. చిన్న పిల్లలు చూస్తున్నారు.. చాలు.. ఇక ఆపండి' అంటూ ట్వీట్ చేశాడు నాని.

ఈ వివాదంలో ఆ ఛానల్ పెద్ద మనిషి ఒక్కసారి(ఒకసారి అయినా తప్పే) చేసిన వ్యాఖ్యను.. మీడియా మహమ్మారి కారణంగా.. ఇప్పుడు వేలు లక్షల సార్లు స్ప్రెడ్ అయిపోయి.. మొబైల్స్ లోకి చేరిపోయి.. ప్రతీ వారి ఫోన్ లోను మార్మోగుతున్న వైనం పైనే నాని ఇలా స్పందించి ఉంటాడని భావించవచ్చు.
Tags:    

Similar News