ఇండస్ట్రీకి హీరోయిన్లను సప్లై చేస్తున్నా

Update: 2016-09-05 06:10 GMT
మొదటి మూవీ అష్టా చెమ్మా నుంచి నేచురల్ యాక్టర్ అనిపించుకున్న నాని.. భలే భలే మగాడివోయ్ మూవీతో నేచురల్ స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత కూడా వరుసగా హిట్స్ సాధించేస్తూ ఊపు మీదున్న ఈ స్టార్.. కొత్త సినిమా మజ్నుని రిలీజ్ కి రెడీ చేశాడు. రీసెంట్ గా ఈ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరగగా.. అందులో ఆసక్తికర కామెంట్స్ చేశాడు నాని.

మజ్నులో హీరోయిన్లుగా నటించిన అను ఇమ్మాన్యుయేల్.. ప్రియశ్రీల పెర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా పొగిడాడు నాని. 'అష్టాచెమ్మా సినిమా ఇప్పుడు చూసుకుంటుంటే ఇంత బ్యాడ్ గా పెర్ఫామ్ చేశానా అనిపిస్తుంది. కానీ తొలి సినిమా అయినా.. అను ప్రియా బాగా నటించారు. రేపు సినిమా గురించి మాట్లాడేటప్పుడు వారి గురించి తప్పకుండా మాట్లాడుకుంటారు. వరుసగా కొత్త హీరోయిన్లను పరిచయం చేస్తున్నా. ఇండస్ట్రీకి హీరోయిన్లను సప్లై చేస్తున్నట్లుంది. కృష్ణగాడి వీర ప్రేమగాధలో మెహ్రీన్ కౌర్.. జెంటిల్మన్ లో నివేదా థామస్.. ఇప్పుడు మజ్నులో వీళ్లిద్దరు. నెక్ట్స్ ఇయర్ బెస్ట్ డెబ్యూ కాంపిటీషన్ లో నా హీరోయిన్సే ఉంటారు. అఫ్ కోర్స్.. ఎవరికిచ్చినా నాకు ప్లాబ్లెం లేదు' అన్నాడు నాని.

ఇక మజ్ను మూవీ ఆడియన్స్ ను కదిలిస్తుందని.. మొదట అందరినీ సినిమాలోకి తీసుకెళ్లి... ఆ తర్వాత సినిమాని ఇంటికి తీసుకెళ్లేంతగా కంటెంట్ ఉంటుందని చెప్పాడు నాని.
Tags:    

Similar News