రవితేజ కారవాన్ లోకి నేనెప్పుడు ఎంటరవుతానో: నాని

Update: 2022-07-25 03:38 GMT
రవితేజ తరువాత ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చి .. అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ డమ్ ను సంపాదించుకున్నవారిలో నాని ముందువరుసలో కనిపిస్తాడు. విభిన్నమైన కథలతో .. విలక్షణమైన పాత్రలతో నాని ఎప్పటికప్పుడు తనని తాను నిరూపించుకుంటూ వస్తున్నాడు. తన తరువాత ఇండస్ట్రీకి వస్తున్నవారికి నాని ఆదర్శంగా నిలిచాడు. రవితేజ కథానాయకుడిగా నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నాని ముఖ్య అతిథిగా వచ్చాడు.

హైదరాబాదులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ .. " ఈ రోజున ఇక్కడికి ఒక గెస్టుగా పిలిచారని రాలేదు. రవి అన్నయ్యను గురించి మాట్లాడటానికి నాకు ఒక అవకాశం దొరుకుంతుందని ఇక్కడికి వచ్చాను. రవి అన్నయ్యకి చిరంజీవిగారంటే చాలా ఇష్టం.

రవితేజ తన కెరియర్ ను స్టార్ట్ చేసినప్పుడు చిరంజీవిగారిని ఎలా స్ఫూర్తిగా తీసుకున్నాడో, నేను నా కెరియర్ ను స్టార్ట్ చేసినప్పుడు రవి అన్నయ్యను అలాగే స్ఫూర్తిగా తీసుకున్నాను.

ప్రతి జనరేషన్ కి ఒకడుంటాడు .. 'నేను అయ్యాను కాదురా .. నువ్వెందుకు అవ్వలేవు' అంటూ ధైర్యాన్ని ఇచ్చేవాడు ఒకడుంటాడు. మేము అప్ కమింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు అలా ధైర్యం ఇచ్చినవాడు రవి అన్నయ్య. ఇందాక వీడియోలో చూశాను చిరంజీవి కేరవాన్ లోకి రవన్నయ్య ఎంటర్ కావడం .. త్వరలో ఆయన కారవాన్ లోకి నేను ఎంటర్ కావాలని కోరుకుంటున్నాను. నా సినిమా ఏదైనాసరే చూడగానే కాల్ చేసి మాట్లాడతాడు. మంచి సినిమాలను ఎంకరేజ్ చేయడాన్ని తన బాధ్యతగా ఫీలవుతాడు.  

'రామారావు ఆన్ డ్యూటీ' టైటిల్ వినగానే చాలా పాజిటివ్ గా అపించింది. నా 'దసరా' సినిమా నిర్మాతలే ఈ సినిమా కూడా చేయడం మరింత ఆనందాన్ని కలిగించిన విషయం. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాను అందించాలనే ఉద్దేశంతో అందరూ కూడా చాలా కష్టపడ్డారు.

ఈ సినిమాతో వేణుగారు రీ ఎంట్రీ ఇస్తుండటం హ్యాపీగా అనిపిస్తోంది. ఇన్నేళ్ల నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ, సినిమా షూటింగు ఉంటేనే రోజు గడిచే ఫ్యామిలీస్ కి రవితేజ ఎంత చేశాడనేది మాటల్లో చెప్పలేం.  20 ఏళ్ల నుంచి రవితేజ ఆన్ డ్యూటీ .. ఈ నెల 29 నుంచి 'రామారావు ఆన్ డ్యూటీ' అంటూ చెప్పుకొచ్చాడు
Tags:    

Similar News