న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'జెర్సీ' అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తికాగానే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది.
ఈ సినిమాలో నాని పాత్ర ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేవిధంగా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నాని పాత్ర నాలుగు షేడ్స్ లో ఉంటుందని సమాచారం. ఒక వ్యక్తి జీవితంలో ని నాలుగు ముఖ్య దశలను ప్రతిబింబించే పాత్రలో 19 ఏళ్ళ టీనేజర్ గా.. 25 సంవత్సరాల యువకుడిగా.. 40లలో ఉండే మధ్య వయస్కుడిగా.. 50 ఏళ్ళ పై బడిన వ్యక్తిగా నాలుగు గెటప్స్ ఉంటాయట. ఈ సినిమా హాలీవుడ్ చిత్రం 'ది క్యూరియాస్ కేస్ అఫ్ బెంజమిన్ బటన్' స్టైల్ లో సాగుతుందని అంటున్నారు. ఇలా నాలుగు పూర్తిగా డిఫరెంట్ గా ఉండే గెటప్స్ లో ఉండడం.. దానికి తగ్గట్టు నటించడం ఛాలెంజ్ తో కూడుకున్న అంశమే. నిజానికి ఈ ఛాలెంజింగ్ పార్ట్ నచ్చడంతోనే విక్రమ్ కుమార్ కు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
విక్రమ్ కుమార్ ఓ బ్రిలియంట్ ఫిలిం మేకర్ కాబట్టి నాని లుక్స్ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా రియలిస్టిక్ గా ఉండేలా చూసుకుంటాడు. ఇక ఇలాంటి పాత్రలో నాని కూడా చెలరేగిపోయి నటించే అవకాశం ఉంది. చాలా రోజల తర్వాత ఒక దర్శకుడు నాని యాక్టింగ్ టాలెంట్ ను ఫుల్ గా బయటకు తీసే పాత్రను డిజైన్ చేశాడన్నమాట.