ఖచ్చితంగా ఇప్పుడున్న దర్శకులు అందరూ దర్శకరత్న దాసరి నారాయణరావు పేరును ఒక్కసారైన తలుచుకోవాల్సిందే. ఎందుకంటే దర్శకుడు అనే జాబ్ కు హోదా తెచ్చి.. ఆ పదవికి కొత్త అలంకారాన్ని తెచ్చింది ఆయనే. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటూ పోస్టర్ల మీద కూడా దర్శకుడు పేరునే పెద్దగా వేసిందే ఆయన సినిమాలొచ్చాకనే.
ఇంతకీ ఇప్పుడు ఈ కథంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఈ మధ్య కాలంలో వచ్చే చాలా సినిమాల్లో దర్శకుడి పేరును ప్రొడ్యూసర్ పేరు తరువాతే వేస్తున్నారు కొందరు. సర్లేండి డబ్బులు పెట్టేది నిర్మాత కాబట్టి.. మరి ఆయన పేరు ముందు ఉండటంలో తప్పులేదు. కాని స్టార్ డైరక్టర్ల సినిమాలకైతే.. అతను చెప్పిన చోటనే అతని పేరు వేయాల్సి వస్తుంది. ఇక కొత్త డైరక్టర్ల పరిస్థితి ఏంటో తెలుసా? అదిగో ఇప్పుడు ''నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్'' సినిమా పోస్టర్లను చూడండి. ముందు నిర్మాత పేరు.. తరువాత కెమెరా మ్యాన్ పేరు.. ఆ తరువాత దర్శకుడు భాస్కర్ బండి పేరును వేశారు. ఇది చూసినవారెవ్వరైనా కూడా దర్శకుడు పేరును ఇలా తొక్కేశారేంటి అనాల్సిందే.
దర్శకుడు కొత్తాడైతే పేరున్న కెమెరా మ్యాన్లు.. అలాగే పాపులర్టీ ఉన్న ప్రొడ్యూసర్లు ఈ టైపులో రచ్చ చేస్తున్నారట. ఎంతో కొత్త వాళ్లతో సినిమాలు తీసినా కూడా.. దిల్ రాజు వంటి ప్రొడ్యూసర్లు దర్శకులు పేర్లను ఇలా క్రిందెక్కడో వేయడం ఎప్పుడన్నా చూశామా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/