ఒకే ఫ్లైట్ లో ఎన్టీఆర్, బాలయ్య

Update: 2016-01-12 06:47 GMT
ఏంటీ.. సెంటెన్స్ సగంలో ఆగిపోయిందని అనుకుంటున్నారా? ఓకే.. లెట్స్ గో టు డీటైల్స్.. నందమూరి నటసింహం బాలయ్య - యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు నటించిన సినిమాలు ఒక రోజు తేడాలో విడుదలవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఇది ముందే తెలిసిన విషయమే. అలాగే అమెరికాలో కూడా రెండు సినిమాలు భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.

ఈ రెండు సినిమాలకు సంబంధించి హార్డ్ డిస్క్ లను.. అమెరికా పంపేశారు. నాన్నకు ప్రేమతో - డిక్టేటర్ ల హార్డ్ డిస్క్ లు.. ఒకే ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్లిపోయాయి. జనవరి 11 రాత్రి 9 గంటలకు హైద్రాబాద్ లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి డిస్పాచ్ అయ్యి వీటి జర్నీ స్టార్ట్ అయింది. సాధారణంగా ఒకే రోజు విడుదలయ్యే సినిమాలను ఇలా ఒకేసారి పంపుతూ ఉంటారు. కానీ విడుదలలో ఒక రోజు గ్యాప్ ఉన్నా.. ఈ నందమూరి సినిమాల హార్డ్ డిస్క్ లు ఒకేసారి డిస్పాచ్ అయ్యాయి. రిలీజ్ డేట్ ప్రకారం చూస్తే.. ఎన్టీఆర్ మూవీని కరెక్ట్ టైంకి పంపగా.. బాలకృష్ణ డిక్టేటర్ ని.. కొంచెం అడ్వాన్స్ గా పంపేశారన్నమాట.

రిలీజ్ విషయంలో పోటీ, రిజల్ట్ విషయంలో ఫైట్ ఉన్నా.. ఇలా డిస్కులు మాత్రం కలిసి జర్నీ చేస్తున్నాయి. బాబాయ్ అబ్బాయ్ ల్లో సంక్రాంతి ఫైట్లో ఎవరు విన్నర్ గా నిలుస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. రెండు సినిమాల పైనా అంచనాలు ఎక్కువగా ఉండడంతో.. రిజల్ట్ ఎటు మొగ్గుతుందో ఆఖరి నిమిషంవరకూ తేలే ఛాన్స్ లేనట్లే.
Tags:    

Similar News