ఈసారి సంక్రాంతికి బాక్సాఫీసు దగ్గర బాబాయ్ బాలకృష్ణతో పోటీ పడాలనుకున్న అబ్బాయ్ ఎన్టీఆర్ వెనక్కి తగ్గాడా? ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన `నాన్నకు ప్రేమతో` ఫిబ్రవరికి వాయిదా పడబోతోందా? అవుననే అంటున్నాయి తెలుగు సినిమా వర్గాలు. సంక్రాంతికి ఎలాగైనా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఎన్టీఆర్ రేయింబవళ్లు షూటింగ్ చేస్తున్నాడు. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇంతలో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తండ్రి సత్యమూర్తి మరణించారు. ఆయన ఆ విషాదం నుంచి బయటికి రావాలంటే చాలా సమయమే పడుతుంది. నాన్నకు ప్రేమతో సినిమాకి సంగీత దర్శకుడు దేవినే కాబట్టి, ఈ పరిస్థితుల్లో ఆయన మళ్లీ పనిపై దృష్టి పెట్టలేడు కాబట్టి సినిమాని వాయిదా వేయడమే మేలని చిత్రబృందం భావిస్తోంది.
దానికితోడు కొంత భాగం సినిమా షూటింగ్ కూడా జరగాల్సి వుందట. ఇలా అన్నీ హడావుడిగా చేయడం కంటే కాస్త సమయం తీసుకోవడమే మేలన్న అభిప్రాయంతో చిత్రబృందం ఉందట. ఇదివరకు సుకుమార్ చేసిన `1` సినిమాని కూడా హడావుడిగా విడుదల చేశారు. ఆ ఎఫెక్ట్ సినిమాపై బాగా పడింది. అలాంటి తప్పుని మళ్లీ చేయకపోవడమే మేలని, సినిమా మొత్తం పూర్తయ్యాక... అంతా ఓకే అనుకొన్నాకే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తున్నట్టు తెలిసింది. మరోపక్క బాలకృష్ణ మాత్రం తన సినిమాని సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకురావల్సిందే అంటూ చిత్రబృందాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు.