వెంకీ సినిమాలో ఎన్టీఆర్ మూవీ స్పూఫ్

Update: 2016-05-16 10:40 GMT
స్టార్ హీరోల్లో ఏమాత్రం భేషజం లేకుండా ఉండే కథానాయకుడు విక్టరీ వెంకటేష్. తన సినిమాల్లో వేరే హీరోయిన్ల ప్రస్తావన తేవడానికి ఇబ్బంది పడడు వెంకీ. ఇంతకుముందు ‘షాడో’ సినిమాలో వెంకీ ‘గబ్బర్ సింగ్’ పవన్ కళ్యాణ్ గెటప్ వేసి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన కొత్త సినిమా ‘బాబు బంగారం’ కోసం వెంకీ ఇంకో స్పూఫ్ ట్రై చేస్తున్నాడట.

సంక్రాంతి హిట్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాల్ని ఇందులో పేరడీలా చేయబోతున్నారట. మరి వెంకీ స్వయంగా ఎన్టీఆర్‌ ను అనుకరిస్తాడో లేదో తెలియదు కానీ.. మారుతి మాత్రం తన సెన్సాఫ్ హ్యూమర్ తో మాంచి కామెడీ స్పూఫ్ రాసి దాన్ని హిలేరియస్ గా ఉండేలా తెరకెక్కించాడట. ఈ సన్నివేశంలో సప్తగిరి కీలకం అంటున్నారు. ఇంతకుముందు మారుతి చేసిన ప్రేమకథా చిత్రమ్.. కొత్త జంట.. లవర్స్ సినిమాల్లో సప్తగిరి కామెడీ హైలైట్ అయింది. మరి ఈ కొత్త కామెడీ ట్రాక్ ఎలా ఉంటుందో చూడాలి.

ఇటీవలే టాకీ పార్ట్ పూర్తి చేసుకుని.. పాటల చిత్రీకరణ కోసం యూరప్ వెళ్లింది ‘బాబు బంగారం’ టీమ్. ఇప్పటిదాకా ఫారిన్లో ఎప్పుడూ పాటలు తీయని మారుతి.. తొలిసారి ఈ సినిమా కోసం యూరప్ వెళ్లాడు. అక్కడ వెంకీ-నయన్ మీద రెండు పాటలు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ‘వెంకటేశూ.. వెంకటేశూ.. దగ్గుబాటి బాసూ.. బాబు మనసు అచ్చమైన బంగారం’ అంటూ వెంకీ మీద ఓ ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుందని సమాచారం. తమిళ యువ సంగీత దర్శకుడు జిబ్రాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇస్తున్నాడు. వచ్చే నెలలోనే ఆడియోతో పాటు సినిమా కూడా రిలీజవుతాయి.
Tags:    

Similar News