అమెరికాలో తన పుట్టినరోజును జరుపుకొంటున్న హీరో - ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఊహించని రేంజిలో ప్రశంసలు లభించాయి. బాలయ్య అంటేనే ఎనర్జీకి మారుపేరని అందరికీ తెలుసు... అలాంటి బాలయ్య ఎనర్జీ గురించి ఆయన కుమార్తె నారా బ్రాహ్మణి చెప్పుకొచ్చారు. తన తండ్రి బాలయ్యకు వయసు పెరుగుతున్న కొద్దీ ఎనర్జీ పెరుగుతోందని ఆమె అన్నారు. ఆయన నిత్య యవ్వనుడిలా దూసుకుపోతున్నారంటూ కితాబిచ్చారు. ఈ వయసులో ఆయన మనవడితో చిన్నపిల్లాడిలా ఆడుకుంటుంటాడని బ్రాహ్మణి అన్నారు. తండ్రి గురించి బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలతో బాలయ్య అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. కాగా బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ఫస్ట్ లుక్ ను బ్రాహ్మణి విడుదల చేశారు. ఈ సందర్భంగా బసవతారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో బ్రాహ్మణి మాట్లాడారు.
తన తండ్రి 57వ ఏళ్ల వయస్సులోకి అడుగు పెట్టారని.. అయితే, ఆయనలో ఆ వయసు కనిపించడం లేదని, చిన్నపిల్లాడిగా మారి తన కుమారుడితో ఆడుతుంటారని ఆమె చెప్పుకొచ్చారు. మానవ సేవే మాధవ సేవ అని చిన్ననాటి నుంచి తమకు చెబుతుండేవారని.. అనేక మందికి చికిత్స అందిస్తూ బసవతాకరకం ఆసుపత్రి దేశంలోనే గొప్ప ఆసుపత్రిగా పేరు పొందిందన్నారు. సన్నిహితులు - ఆసుపత్రి సిబ్బంది సహకారంతోనే ఇదంతా సాధ్యమైందన్నారు. బాలకృష్ణ జన్మదినం సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌతమీపుత్ర శాతకర్ణి చిత్ర బృందం పాల్గొంది. క్యాన్సర్ బాధిత చిన్నారులతో కలిసి బ్రాహ్మణి కేక్ కట్ చేశారు.
మరోవైపు బాలయ్య జన్మదిన వేడుకలు రాష్ట్రమంతటా జరుగుతున్నాయి. విజయవాడలో బాలయ్య అభిమానులు సందడి చేశారు. ఆయన సొంత నియోజకవర్గం హిందూపురంలోనూ భారీ ఎత్తున వేడుకలు జరుగుతున్నాయి. అమెరికాలోనూ బాలయ్య అభిమానులు సంబరాలు జరుపుకొంటున్నారు.