నారా రోహిత్ మాటల్లేవ్..

Update: 2018-03-14 06:46 GMT
సాధారణంగా ఏ హీరో అయినా కూడా తనకంటూ ఒక కమర్షియల్ హిట్ వచ్చిన తరువాత ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతాడు. ఎక్కువగా మార్కెట్ ఎలా పెంచుకోవాలి అనే విషయంపైనే దృష్టి పెడుతుంటారు. పైగా అవకాశాలు రావాలంటే ఆ విధానంలో నడుచుకొక తప్పదు. కానీ నారా రోహిత్ మాత్రం ఆ విషయంలో అస్సలు తగ్గడం లేదు. రిజల్ట్ ఎలా ఉన్నా సరే ప్రయోగాలకే తన కెరీర్ అంకితం అనేలా సినిమాలను చేస్తున్నాడు.

ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమాలో నారా రోహిత్ ఎదో ఒక కొత్త విషయం గురించి చెప్పకనే చెప్పాడు. ముఖ్యంగా తన వాయిస్ మాడ్యులేషన్ తో చాలా కొత్తగా ఆకట్టుకుంటూ వచ్చాడు. నటుడిగా కూడా చాలా వినూత్నంగా కనిపించాడు. ఇకపోతే రీసెంట్ గా మరో ప్రయోగాత్మక ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో మొత్తం నారా రోహిత్ చప్పుడు చేయకుండా కనిపిస్తాడట. అంటే మూగవాడిలా నటించనున్నాడట.

గత కొన్ని రోజుల క్రితం పిబి.మంజునాథ్ అనే దర్శకుడు చెప్పిన ఆ స్క్రిప్ట్ ని విని సింగిల్ సిట్టింగ్ లో ఒకే చేశాడని తెలుస్తోంది. దాదాపు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా సెట్ అయినట్లు సమాచారం. ఈ ఉగాదికి నిర్మాతల నారాయణ రావు అట్లూరి సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నారు. వికాస్ కురుమెళ్ల సినిమాకు సంగీతం అందించనున్నాడు. ప్రస్తుతం నారా రోహిత్ పరుచూరి మురళి దర్శకత్వంలో ఆటగాళ్లు అనే సినిమా చేస్తున్నాడు........

Tags:    

Similar News