నారా రోహిత్ సినిమాలు వరుసగా విడుదలవుతున్నాయి. ఈ వేసవిలో నాలుగైదు సినిమాలైనా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం వుంది. ఇప్పటికే తుంటరి మూవీతో వచ్చిన ఈ నారావారబ్బాయి... ఏప్రిల్ 1న ‘సావిత్రి’ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాపై పాజిటివ్ బజ్ వుండటంతో.. చిత్ర యూనిట్ పబ్లిసిటీని దంచేస్తోంది. మహానటి ‘సావిత్రి’ పేరుతో నందిత ఇందులో టైటిల్ రోల్ పోషిస్తోంది. పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డాక్టర్ వి.బి.రాజేంద్రప్రసాద్ నిర్మించారు. శ్రవణ్ సంగీతం అందించారు. క్లీన్ యు సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం పై చిత్ర యూనిట్ భారీగానే అంచనాలు పెట్టుకుంది.
ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో సుమారు 73 థియేటర్లలో రిలీజ్ చేస్తోంది విజన్ ఫిలిం మేకర్స్ సంస్థ. నారా రోహిత్ నటించిన గత చిత్రాలకంటే... ఈ చిత్రమే ఓవర్సీస్ లో అదిక థియేటర్లలో విడుదలవుతుండటం విశేషం. ఓ మీడియం బడ్జెట్టు తో నిర్మించిన ఈ చిత్రం ఇన్ని థియేటర్ల లో విడుదల కావడం కూడా ప్రత్యేకమే అంటోంది చిత్ర బృందం. పెద్ద హీరోలు నటించిన చిత్రాలో లేక భారీ బడ్జెట్టు చిత్రాలు మాత్రమే ఇంత పెద్ద సంఖ్యలో ఓవర్సీస్ లో విడుదలవుతాయని తెలిపింది. దీన్ని బట్టి చూస్తోంటే... కేవలం రెండు తెలుగు రాష్ట్రాల మీద వచ్చే బాక్సాఫీస్ కలెక్షన్ల మీదనే ఆధారపడకుండా... ఓవర్సీస్ లోనూ తన సత్తా చాటాలని నారా రోహిత్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది.