మల్టీ స్టారర్ కల్చర్ మన దగ్గర ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. సోలోగానే చరిత్ర సృష్టించేయాలనే కాన్సెప్ట్ నుంచి మెల్లమెల్లగా తెలుగు హీరోలు బయటకు వస్తున్నారు. సీనియర్ హీరోలు కూడా మల్టీ స్టారర్ ల వైపు మొగ్గు చూపుతున్న సమయంలో.. కుర్ర హీరోలు మరింత ఉత్సాహం చూపించేస్తున్నారు.
ఇప్పటివరకూ ఇద్దరు హీరోలు కలిసి నటిస్తేనే మల్టీ స్టారర్ అనేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు నలుగురు యంగ్ హీరోలు కలిసి ఒక సినిమా చేసేందుకు రెడీ అన్నారట. ఆ నలుగురు ఎవరంటే.. విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నారా రోహిత్.. బాలీవుడ్ లో విలన్ గా కూడా చేసొచ్చిన సుధీర్ బాబు.. తెలుగు-తమిళ భాషల్లో బిజీగా ఉన్న సందీప్ కిషన్.. మాస్ ఇమేజ్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్న సాయి కుమార్ కొడుకు ఆది. ఈ నలుగురు ఇప్పుడు ఒక సినిమాకు సైన్ చేశారట.
భలే మంచి రోజు ఫేమ్ దర్శకుడు శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని.. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించనున్నారు. ఫిబ్రవరిలోనే ఈ నలుగురు హీరోల మల్టీ స్టారర్ మూవీపై అనౌన్స్ మెంట్ రానుండగా.. మార్చ్ లో షూటింగ్ ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా శ్రీరాం ఆదిత్య చెప్పిన స్టోరీ లైన్.. ఈ నలుగురు హీరోలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రధాన కారణం అయిందని టాక్.