పోయినేడాది ‘16’ పేరుతో ఒక తమిళ డబ్బింగ్ సినిమా వచ్చింది గుర్తుందా? సీనియర్ నటుడు రెహమాన్ ప్రధాన పాత్రలో నటించిన ఆ చిత్రం పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై మంచి విజయమే సాధించింది. దక్షిణాదిన వచ్చిన బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటిగా దాన్ని చెప్పొచ్చు. తమిళంలో ఆ చిత్రం సెన్సేషనల్ హిట్టయింది. ఆ చిత్రాన్ని కేవలం 21 ఏళ్ల వయసున్న కార్తీక్ నరేన్ అనే యువ దర్శకుడు రూపొందించాడు. అతడి టాలెంటుకి ఫిదా అయిపోయిన సీనియర్ దర్శక నిర్మాత గౌతమ్ వాసుదేవ్ మీనన్ అతడి రెండో సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చాడు. ‘16’ తరహాలోనే ఇది కూడా థ్రిల్లరే. సినిమా పేరు.. ‘నరగాసురన్’. గత ఏడాదే ఈ చిత్రం పూర్తయింది. విడుదలకు కూడా సిద్ధమైంది. ఐతే కొన్ని కారణాల వల్ల విడుదల ఆలస్యమైంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేశారు. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ చేశారు.
ఒక భార్య-భర్త.. ప్రేమికులైన ఒక అమ్మాయి-అబ్బాయి.. ఒక పోలీసాఫీసర్.. వీళ్ల ఐదుగురి మధ్య నడిచే కథ ఇది. ఒక అటవీ ప్రాంతంలోని బిల్డింగ్ లో కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. దాని నేపథ్యంలో కథ నడుస్తుంది. ఆ సంఘటనలేంటన్నది ట్రైలర్లో చూపించలేదు. కానీ క్యారెక్టర్ల సంభాషణను బట్టి చూస్తే అనూహ్యమైన ఘనటనలే జరుగుతాయని తెలుస్తోంది. సినిమాలో థ్రిల్లింగ్ మూమెంట్స్ కు ఢోకా ఉండదని అర్థమవుతోంది. అటవీ నేపథ్యంలో అదిరిపోయే విజువల్స్ తో సినిమాను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. చాలా తక్కువ బడ్జెట్లోనే మంచి క్వాలిటీతో ‘16’ సినిమా తీసిన కార్తీక్.. ఈసారి ఇంకా క్వాలిటీ చూపించాడు. ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ రేపేలా ఉంది. థ్రిల్లర్ ప్రియుల్లో క్యూరియాసిటీ రావడం ఖాయం. అరవింద్ స్వామి.. శ్రియ సరన్.. సందీప్ కిషన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. గౌతమ్ మీనన్ తో గొడవ తలెత్తడంతో ఆయనకు టాటా చెప్పేసి సొంతంగా సినిమాను రిలీజ్ చేస్తున్నాడు కార్తీక్. ఈ చిత్రం తెలుగులో ‘నరకాసురుడు’ పేరుతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
Full View