నీలాంబ‌రి పాత్ర 'పొన్నియిన్ సెల్వ‌న్‌' నుంచి పుట్టిందా?

Update: 2022-09-08 02:30 GMT
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన సెన్సేష‌న‌ల్ మూవీ `ప‌డ‌య‌ప్పా`. కె.ఎస్‌. ర‌వికుమార్ తెర‌కెక్కించిన ఈ మూవీకి క‌థ ఎవ‌రు అందించారో తెలుసా.. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ. ర‌మ్య‌కృష్ణ‌, సౌంద‌ర్య హీరోయిన్ లుగా న‌టించిన ఈ మూవీకి ఏ.ఆర్‌. రెహ‌మాన్ సంగీతం అందించారు. `ప్రేమ దేశం` అబ్బాస్‌, ప్రీతి విజ‌య్ కుమార్ జంట‌గా న‌టించారు. 1999లో విడుద‌లైన ఈ మూవీని తెలుగులో `న‌ర‌సింహ‌` పేరుతో విడుద‌ల చేశారు. రెండు భాష‌ల్లోనూ ఈ మూవీ సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది.

ఇందులో నీలాంబ‌రి పాత్ర‌లో న‌టించిన ర‌మ్య‌కృష్ణ న‌ట‌న‌, ఆమె పాత్ర సినిమాకు ప్ర‌ధాన హైలైట్ గా నిలిచి ఇప్ప‌టికీ ర‌మ్య‌కృష్ణ కెరీర్ లో ఎవ‌ర్ గ్రీన్ క్యారెక్ట‌ర్ గా నిలిచి సంచ‌ల‌నం సృష్టించింది. ఈ పాత్ర వెన‌కున్న సీక్రెట్ ని సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ `పొన్నియిన్ సెల్వ‌న్‌` ఆడియో, ట్రైల‌ర్ రిలీజ్ కార్య‌ క్ర‌మంలో వెల్ల‌డించి షాకిచ్చారు.

చియాన్ విక్ర‌మ్, కార్తి, జ‌యం ర‌వి, త్రిష‌, ఐశ్వ‌ర్యారాయ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న భారీ పీరియాడిక్ మూవీ `పొన్నియిన్ సెల్వ‌న్‌`. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా తొలి భాగాన్ని సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా చెన్నైలో ఆడియో, ట్రైల‌ర్ రిలీజ్ కార్య‌ క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌త్యేకంగా పాల్గొన్న సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ `పొన్నియిన్ సెల్వ‌న్‌` కు `ప‌డ‌య‌ప్ప‌`కు ఉన్న క‌నెక్ష‌న్ ని బ‌య‌ట‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా ప‌డ‌య‌ప్ప మూవీ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. సినిమాలో ర‌మ్య‌కృష్ణ పోషించిన నీలాంబ‌రి పాత్ర‌ని క‌ల్కి కృష్ణ‌మూర్తి ర‌చించిన `పొన్నియిన్ సెల్వ‌న్‌` లోని నందిని పాత్ర నుంచి ప్రేర‌ణ పొంది ఆ పాత్ర‌ని రాసుకున్నాన‌న్నారు.

ర‌జ‌నీ నీలాంబ‌రి పాత్ర కోసం స్ఫూర్తిగా తీసుకున్న నందిని పాత్ర‌లో ఇప్ప‌డు ఐశ్వ‌ర్యా రాయ్ న‌టించ‌డం విశేషం. ఇదిఅలా వుంటే ర‌జ‌నీ కాంత్ ప్ర‌స్తుతం నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్ పిక్చ‌ర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న `జైల‌ర్‌` మూవీలో న‌టిస్తున్నారు. ఇటీవ‌లే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైన ఈ మూవీలోని కీల‌క పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News