కరోనా సెకండ్ వేవ్‌ కార్పోరేట్‌ సృష్టి అంటున్న ఎర్రన్న

Update: 2021-03-21 12:22 GMT
తెలుగు విప్లవ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారి ఎర్రన్న గా పేరు దక్కించుకున్న ఆర్ నారాయణ మూర్తి నేడు విజయవాడలో పర్యటించాడు. హాస్యానందం సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్టూన్‌ ఎగ్జిబిషన్‌ ను ప్రారంభించిన నారాయణ మూర్తి ఆ సందర్బంగా కరోనా సెకండ్‌ వేవ్‌ గురించి మాట్లాడుతూ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. కరోనా సెకండ్‌ వేవ్ అంటూ ప్రజలను భయపెట్టి కార్పోరేట్‌ సంస్థలు శానిటైజర్స్‌ మరియు మాస్క్‌ లను అమ్మేసుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆరోపించాడు. ప్రభుత్వాలు సైతం ఆ కార్పోరేట్ సంస్థలకు మద్దతు పలికేలా వ్యవహరిస్తున్నాయి అంటూ ఎర్రన్న ఆరోపించాడు.

ఇప్పటికే కరోనా వల్ల సామాన్య ప్రజానికం ముఖ్యంగా మద్య తరగతి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరోనా విపత్తు వల్ల అంబానీ మరియు అదానీలు మాత్రమే లాభ పడ్డారు. వారికి ఈ సమయంలో వేల కోట్ల ఆస్తులను దండుకున్నారని నారాయణమూర్తి ఆరోపించాడు. ఇక వైజాగ్ ఉక్కు కర్మాగారంను ప్రైవేటీకరణ చేయడం దారుణం అన్నాడు. పంచ భూతాలను సైతం అమ్మేసే విధంగా కేంద్రం తీసుకుంటున్న విధానాలు చేపట్టిన కార్యక్రమాలు ఉన్నాయంటూ ఎర్రన్న వ్యాఖ్యలు చేశాడు. విశాఖ ఉక్కు కర్మాగార కార్మికుల ఉద్యమంతో పాటు రైతు ఉద్యమంకు కూడా తాను మద్దతుగా నిలుస్తున్నట్లుగా ప్రకటించాడు.
Tags:    

Similar News