హాస్య కథానాయకుడిగా ఒక వెలుగు వెలిగిన నరేశ్, ఇప్పుడు కేరక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీ. ఈ మధ్య కాలంలో ఆయన లేని సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు." అమ్మ సినిమాల్లో ఉండటం వలన, నాకు సినిమాల పిచ్చి ఎక్కువగానే ఉండేది. అందువలన చదువు పెద్దగా అబ్బలేదు. టెన్త్ క్లాస్ లో మార్కులు పెద్దగా రాలేదు.. అమ్మ కోప్పడినా ప్రయోజనం లేకుండా పోయింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎస్వీఆర్ గారితోను.. సీనియర్స్ తో కలిసి నటించే ఛాన్స్ రావడం నా అదృష్టం.
ఎప్పుడైతే నేను సినిమాల్లోకి రావాలనుకున్నానో అప్పుడే నేను భరతనాట్యం.. బైక్ రైడింగ్ నేర్చుకున్నాను. ఆ తరువాత హీరోగా 'నాలుగు స్థంభాలాట' నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. కృష్ణగారు నాకు స్ఫూర్తి.. ఆయన సినిమాలను నేను తప్పకుండా చూసేవాడిని.
ఆయన సూచనలు గొప్పగా ఉండేవి. ఒకసారి అమ్మకి తెలియకుండా నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. ఆ సినిమా చూసిన కృష్ణగారు, డబ్బింగ్ చెప్పడంపై ఇంకా శ్రద్ధ పెట్టమని చెప్పారు. అలా ఒక స్నేహితుడిలా ఆయన నాకు సలహాలు .. సూచనలు ఇచ్చేవారు.
నేను.. రమేశ్.. మిగతావాళ్లమంతా కలిసి చాలా సరదాగా ఉండేవాళ్లం. అప్పటికీ మహేశ్ చాలా చిన్నవాడు. ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉండేవాడు. మొదటి నుంచి కూడా మహేశ్ బాబు చాలా సిగ్గరి.. ఎక్కువగా మాట్లాడేవాడు కాదు.
తను యాక్టింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను. 'కొడుకు దిద్దిన కాపురం' సినిమా సమయానికి వచ్చేసరికి, డాన్సులు.. ఫైట్లు చేసేయడం మొదలుపెట్టాడు. అప్పుడే అనుకున్నాము తాను గొప్ప హీరో అవుతాడని. అనుకున్నట్టుగానే తను స్టార్ అయ్యాడు.
సినిమాల్లోకి రమ్మని నన్ను ఎప్పుడూ ఎవరూ ఫోర్స్ చేయలేదు. నాకు నేనుగా సినిమాల్లో రావాలనుకున్నాను.. అందుకు తగిన కసరత్తు చేశాను. ఇంతకాలంగా సినిమాల్లో కొనసాగుతున్నాను. మన అబ్బాయి కదా అనేసి హీరోను చేసి జనం మీద రుద్దాలని నేను అనుకోవడం లేదు. ఇక్కడ రాణించాలంటే టాలెంట్ ఉండాలి.. కాలం కలిసి రావాలి. అందువల్లనే మా అబ్బాయిని నేను ఫోర్స్ చేయలేదు. తన ఇష్టం మేరకే సినిమాల్లోకి వచ్చాడు.. తన ప్రయత్నాలేవో తాను చేస్తున్నాడు" అని చెప్పుకొచ్చాడు.