జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీనియర్ నటుడు పోసాని కృష్ణ మురళి తీవ్ర పదజాలంతో విరుచుకు పడిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై పవన్ వ్యాఖ్యలను ఖండిసస్తూ.. పవన్ పై పోసాని ఫైర్ అయ్యారు. దీంతో పవన్ ఫ్యాన్స్ తనకు ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ బూతులు తిడుతున్నారని ఆరోపిస్తూ.. పోసాని వివాదాస్పద కామెంట్స్ చేశారు.
పవన్ కళ్యాణ్ ఒక సైకో అంటూ వ్యాఖ్యానించిన పోసాని.. ఆయన కుటుంబం పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన భార్య పై అసభ్యకరమైన కామెంట్స్ చేసినవాళ్ళని ఏమైనా తిట్టవొచ్చు అంటూ పవన్ కుటుంబాన్ని ఈ వివాదంలోకి లాగి ఇష్టమొచ్చినట్టు రెచ్చిపోయారు పోసాని. దీంతో జనసేనాని అభిమానులు, మద్దతుదారులు పోసాని పై మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ నటుడు నరేష్ కూడా ఈ వ్యవహారం పై స్పందించారు. పవన్ కళ్యాణ్ అయినా పోసాని కృష్ణ మురళి అయినా వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన వాటికి తాము కట్టుబడి లేమని.. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ - ప్రొడ్యూసర్ కౌన్సిల్ లకు కట్టుబడి ఉంటామని నరేష్ అన్నారు. ''పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ నేను చూడలేదు. చాలా మాట్లాడారని విన్నాను. నేను చూస్తాను. చూసిన తర్వాత మాట్లాడతాను. 'మా' ఎన్నికలు అయిపోయిన తర్వాత కచ్చితంగా సెపరేట్ గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను'' అని నరేష్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.