న‌రేష్ - ప‌విత్రా లోకేష్ వీడీయోతో క్లారిటీ!

Update: 2022-12-31 07:26 GMT
సీనియ‌ర్ న‌టుడు న‌రేష్, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప‌విత్రా లోకేష్ గ‌త కొంత కాలంగా వార్త‌ల్లో నిలుస్తూ నెట్టింట వైర‌ల్ అవుతున్నారు. వీరిద్ద‌రు క‌లిసి చాలా సినిమాల్లో జంట‌గా న‌టించారు. వివిధ ఫంక్ష‌న్ ల‌లోనూ జంట‌గా క‌నిపించ‌డ‌మే కాకుండా న‌రేష్ ఫ్యామిలీకి సంబంధించిన కార్య‌క్రమాల్లోనూ జంట‌గా క‌లిసి పాల్గొన్నారు. దీంతో గ‌త కొంత కాలంగా వీరిద్ద‌రు రిలేష‌న్ లో వున్నారంటూ జోరుగా వార్త‌లు వినిపించ‌డం మొద‌లైంది. ఈ వార్త‌ల‌ని న‌రేష్‌, ప‌విత్ర‌ ఖండించ‌క పోవ‌డంతో నెట్టింట ఈ జంట‌పై జోరుగా క‌థ‌నాలు మొద‌ల‌య్యాయి.

సినిమాల్లో క‌లిసి న‌టిస్తున్న ఈ జంట రిలేష‌న్ లో వుంటున్నారంటూ న‌రేష్ మూడవ భార్య ర‌మ్య మైసూర్ లోని ఓ హోట‌ల్ లో న‌రేష్‌, ప‌విత్రా లోకేష్ వున్నార‌ని తెలుసుకుని అక్క‌డికి వెళ్లి ఇద్ద‌రిని చెప్పుతో కొట్టాల‌ని ప్ర‌య‌త్నించ‌డం తీవ్ర క‌ల‌క‌లాన్ని రేపింది.

అయితే ఆ స‌మ‌యంలో న‌రేష్ చ‌ప్ప‌ట్లు కొడుతూ ప‌విత్రా లోకేష్ తో క‌లిసి పోలీసుల స‌హ‌యంతో అక్క‌డి నుంచి వెళ్లిపోవ‌డం తెలిసిందే. ఆ త‌రువాత కూడా  ప‌విత్రా లోకేష్‌, న‌రేష్ లు క‌లిసి వున్న ప‌లు ఫొటోలు, వీడియోలు నెట్టింట చ‌క్క‌ర్లు కొట్ట‌డం తెలిసిందే.

త‌న‌పై ప‌లు యూట్యూబ్ ఛాన‌ల్స్ త‌ప్పుగా ప్ర‌చారం చేస్తున్నాయంటూ ప‌విత్రా లోకేష్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ని ఆశ్ర‌యించ‌డం, నరేష్ కూడా త‌న త‌ర‌హాలోనే పోలీసుల్ని ఆశ్ర‌యించ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇదిలా వుంటే డిసెంబ‌ర్ 31న సోష‌ల్ మీడియా వేదిక‌గా న‌రేష్ షేర్ చేసిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది. వెల్క‌మ్ టు అవ‌ర్ వ‌ర‌ల్డ్ కేక్ క‌ట్ చేసిన న‌రేష్, ప‌విత్రా లోకేష్ ఒక‌రికి ఒక‌రు కేక్ తినిపించుకున్నారు.

అంతే కాకుండా ఇద్ద‌రం ఒక్క‌ట‌వుతున్నామే అర్థం వ‌చ్చేలా 'లిప్ లాక్‌' చేస్తూ క‌నిపించారు. అంతే కాకుండా త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నామంటూ ప్ర‌క‌టించారు. న్యూ ఇయ‌ర్‌, న్యూ బిగినింగ్స్‌..మీ అంద‌రి ఆశీస్సులు కావాలి మీ #PavitraNaresh అంటూ షేర్ చేసిన వీడియోకు హ్యాష్ ట్యాగ్ ని జ‌త చేశారు. ఈ వీడియో చూసిన వాళ్లు చాలా మంది సినిమా స్టంట్ నా నిజ‌మా..ఏదైనా న‌రేష్‌, ప‌విత్రా లోకేష్ కు ఆల్ ద బెస్ట్ 'అంటున్నారు. ప్ర‌స్తుతం న‌రేష్ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View



Tags:    

Similar News