ఫోటో వల్ల ప్రెగ్నెన్సీ బాధ

Update: 2017-08-26 12:48 GMT
కెరీర్ లో మోడల్ గా జీవితాన్ని స్టార్ట్ చేసి పాపులర్ అయిన భామ నగ్రిస్ ఫక్రి. ఈ అమ్మడు అదృష్టం ఏమిటో గాని అందరు 16 ఎల్లా వయసప్పుడే హీరోయిన్స్ గా పరిచయం అయితే ఈ అమ్మడు మాత్రం మూడు పదుల వయసొచ్చాక వెండి తెరపైకి అడుగుపెట్టింది. 2011 లో రాక్ స్టార్ సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైన ఈ భామ మొదటి సినిమాతోనే బెస్ట్ హీరోయిన్ గా అవార్డులను కూడా అందుకుంది. ఆ సినిమా మంచి విజయాన్ని ఇవ్వడంతో కొన్ని రోజులు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

అయితే రాను రాను ఈ అమ్మడి హవా తగ్గిపోవడంతో ఐటెమ్ సాంగ్ లో మెరిసి మరి కొన్ని అవకాశాలను దక్కించుకుంది. చివరగా 2016 తర్వాత అమ్మడు ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. కనీసం స్పెషల్ రోల్స్ కోసమైనా పిలుస్తారేమో అనుకుంటే అది కూడా లేదు. దీంతో ఈమెకు ఆవకాశాలు రాకపోవడానికి కారణం ఇదేనంటూ సోషల్ మీడియాలో వార్తలు చెలరేగడంతో ఫక్రి చాలా ఆగ్రహించింది .

అయితే ఆమె రీసెంట్ గా ఓ ఎయిర్ పోర్ట్ లో కొంచెం లావుగా కనిపించడంతో ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినబడ్డాయి అంతే కాకుండా ఆమె కడుపుతో ఉన్నట్టు ఓ ఫోటో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో ఫక్రి కూడా ఆ ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ.. నేను ప్రెగ్నెన్సీ తో లేను ఎక్కువగా ఫుడ్ తీసుకోవడం వల్ల అలా జరిగిందని ఓ క్లారిటీ ఇచ్చింది. అలాగే ఈ రూమర్లకు ఆమె ఇవి పెద్ద జోక్స్ అంటూ కామెంట్ చేసింది. 
Tags:    

Similar News