రైనోతో ప్రేమలో పడిందమ్మోయ్‌

Update: 2015-05-26 22:30 GMT
నర్గీస్‌ ఫక్రీ.. అమెరికాలో పుట్టి పెరిగి, బాలీవుడ్‌లో కథానాయిక అయ్యింది. ఇక్కడ ఎంత పోటీ ఉన్నా తనకంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్‌ చేసుకుని ముందుకు సాగుతోంది.  ప్రతి ఫ్రేములోనూ హాట్‌ అప్పియరెన్స్‌ ఈ అమ్మడికే తెలిసిన విద్య. అందుకే స్టార్‌ హీరోలు పిలిచి మరీ అవకాశాలిస్తున్నారు. ప్రస్తుతం హాలీవుడ్‌లో స్పై అనే సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాతో బిజీగా ఉండడం వల్ల బాలీవుడ్‌లో వేరే ఏ సినిమాకి కమిటవ్వలేదు

ఈ అమ్మడు ఫేస్‌బుక్‌లో చాలా యాక్టివ్‌ పార్టిసిపెంట్‌. తన వ్యక్తిగత విషయాలతో పాటు జంతువులపైనా తన ప్రేమాదరణ గురించి కూడా ఎక్కువగా తెలియజేస్తుంది. ప్రస్తుతం కెన్యా బోర్డర్‌లోని ఒక నేషనల్‌ పార్కులో విహరిస్తోంది. వన్యప్రాణుల్లో అరుదైన జీవి రైనో. ఓ అధికారిక సర్వే ప్రకారం తెల్లజాతి రైనోలు అంతరించిపోతున్నాయి.ముఖ్యంగా సుడాన్‌ లాంటి చోట ఇవి ప్రమాదకర స్థాయిలో తగ్గిపోయాయని సర్వే చెబుతోంది. అందుకే వాటి సంరక్షణకు ప్రపంచం నడుం కట్టాలని, అందుకు ఫండ్‌ కావాలని అడుగుతోంది నర్గీస్‌.

సుడాన్‌లో చిట్టచివరి తెల్ల రైనో (మేల్‌) ఆల్పెజెటాలో ఉంది. దాంతో పాటే నాలుగు ఫీమేల్‌ రైనోలు ఉన్నాయి. ఇవి కూడా వేటగాళ్లకు బలైపోతే పరిస్థితి ఏంటి? అయితే వీటిని కాపాడుకోవాలన్నా.. సంతతి వృద్ధి చెందాలంటే డొనేషన్‌లతో వాటిని సాకాలని చెబుతోంది.. నర్గీస్‌ ప్రయత్నం బేషుగ్గానే ఉంది. మరి ఎవరు ఎంత స్పందిస్తారు? అన్నది వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News