ఛలో సక్సెస్ తో కెరీర్ లో మంచి జోష్ తెచ్చుకున్న హీరో నాగశౌర్య కొత్త సినిమా @నర్తనశాల టీజర్ విడుదలైంది. రెగ్యులర్ గా కాకుండా కాస్త వెరైటీగా అనిపిస్తున్న ఈ మూవీలో శౌర్య డాన్స్ మాస్టర్ గా చేస్తున్నట్టుగా ఉంది. చిన్నప్పటి నుంచి కొడుకుని సుకుమారంగా పెంచడంతో అతను కాస్తా అమ్మాయిల మనస్తత్వంతో సున్నితంగా పెరుగుతాడు. ఎదిగే కొద్దీ వయసు రీత్యా రావాల్సిన మార్పులు శారీరకంగా వస్తాయి కానీ మానసికంగా మాత్రం తేడాగానే ఉంటాడు. ఆఖరికి పెళ్లి అంటే మొహం తిప్పుకునే దాకా వస్తుంది పరిస్థితి. అలాంటి హీరో నర్తనశాలలో ఏం చేసాడు ఎలా ప్రేమలో పడ్డాడు తనకు ఎదురైన సవాళ్ళను ఎదురుకుని మగాడిలా ఎలా రుజువు చేసుకున్నాడు అనేదే @నర్తనశాల. టీజర్ ని విశ్లేషిస్తే ఇది కథగా కనిపిస్తోంది. తండ్రిగా శివాజీరాజా కనిపిస్తుండగా గే లాంటి హీరో పాత్రలో నాగ శౌర్య చాలా కొత్తగా ట్రై చేసాడు.
శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీలో కశ్మీరా హీరోయిన్ గా పరిచయమవుతోంది. టీజర్ మొత్తం సరదా సన్నివేశాలతో నింపేశారు. చిన్నప్పటి నుంచి అలా పెంచితే ఆ ఫీలింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటూ హీరో పాత్ర స్వభావాన్ని చెప్పేసిన దర్శకుడు చివర్లో శివాజీ రాజాతో నా కొడుకు గేనా అంటూ సింబాలిక్ గా చెప్పించడం చూస్తే ఎంటర్ టైన్మెంట్ ఓ రేంజ్ లో ఉండబోతోందని అర్థమవుతోంది.ఛలో తర్వాత మహతి స్వర సాగర్ మరోసారి ఈ టీమ్ తో టై అప్ అయ్యాడు. నర్తనశాల అనేది నాగశౌర్య నడిపే డ్యాన్సింగ్ స్కూల్ పేరులా ఉంది. విజయ్ సి కుమార్ ఛాయాగ్రహణం రిచ్ గా ఉండగా విజువల్స్ కూల్ గా ఉన్నాయి. మొత్తానికి ఛలోని మించిన వినోదాన్ని దానికి పూర్తిగా భిన్నమైన కాన్సెప్ట్ తో తీసుకొస్తున్న నాగ శౌర్య ఇది కూడా తన స్వంత బ్యానర్ ఐరా లోనే చేస్తున్నాడు. ఉషా మల్పూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా తండ్రి శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పకులు. ఈ నెల చివరిలో విడుదల చేసే ప్లాన్ లో ఉంది యూనిట్.
Full View