ఆసక్తిరేపుతున్న యాక్టర్ నాజర్ 'సైంటిస్ట్' లుక్..!

Update: 2021-05-17 16:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎలాంటి మార్పులు వచ్చాయో మెల్లమెల్లగా ప్రేక్షకులకు అర్ధమవుతుంది. ఇదివరకు కల్పిత కథల ఆధారంగానే సినిమాలు రూపొందించేవారు కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. నిజజీవితం నుండి కథలను ఎంచుకొని వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు తెరమీదకు తీసుకొస్తున్నారు మేకర్స్. ఇప్పుడున్న రీమేక్స్ కాలంలో సొంత కథలను తెరకెక్కించడం తగ్గిపోయింది. కానీ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా సినిమాలు రూపొందించేందుకు మేకర్స్ సన్నద్ధం అవుతున్నారు.

ప్రస్తుతం అలాంటి నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా నల్లమల. రవిచరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న నల్లమల సినిమా నల్లమల అడవిలో జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకేక్కుతోంది. ఇదివరకే చాలామంది నల్లమల గురించి వారి సినిమాల్లో ప్రస్తావించారు. కానీ ఎవరు కూడా ఇంత లోతుగా చర్చించలేదని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో అమిత్ తివారి - భానుశ్రీ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో నాజర్ - తనికెళ్ళ భరణి లాంటి సీనియర్ నటులు కూడా నటిస్తున్నారు.

అయితే తాజాగా నల్లమల సినిమాలో నాజర్ లుక్ సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో నాజర్ సైంటిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు. ఓ అపరమేధస్సు కలిగిన సైంటిస్ట్ నల్లమల అడవిలో చేరి పరిశోధనలు చేసి అడవిలో అసలు ఏం కనిపెట్టాడు..? తాను ప్రయోగాలు జరుపడానికి నల్లమల అడవినే ఎందుకు ఎంచుకున్నాడు.. అక్కడి లైఫ్ ఎలాంటిది.. అనే అంశాల చుట్టూ ఈ సినిమా చర్చలు జరుపనుంది. నాజర్ లుక్ చూస్తే సినిమాలో చాలా కీలకమైన పాత్ర పోషించినట్లు అనిపిస్తుంది. మరి ఈ సీనియర్ నటుడు ఎలా ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి. ఈ సినిమాను ఆర్ఎం నిర్మిస్తున్నారు. సంగీతం ఆర్.పి అందిస్తున్నారు.
Tags:    

Similar News