2.ఓ టీజ‌ర్‌ పై జాతీయ మీడియా దుగ్ధ‌!

Update: 2018-09-13 08:03 GMT
ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉత్కంటగా ఎదురు చూస్తున్న వేళ‌.. నేటి ఉద‌యం 9 గంట‌ల‌కు 2.ఓ టీజ‌ర్ ఘ‌నంగా రిలీజైంది. ర‌జ‌నీకాంత్ - శంక‌ర్ అభిమానుల్లోకి నేరుగా దూసుకెళ్లింది. ఫ్యాన్స్ నుంచి ఈ టీజ‌ర్‌ లోని గ్లింప్స్‌ కి గొప్ప స్పంద‌న ల‌భించింది. విజువ‌ల్ ఫీస్ట్ అన్న టాక్ వినిపించింది. అయితే ఈ టీజ‌ర్‌ కి జాతీయ మీడియా ఎలా స్పందించింది? అంటే .. కొన్ని రివ్యూలు ప‌రిశీలిస్తే సోసోనే అని అర్థ‌మ‌వుతోంది.

ప్ర‌తిసారీ `సౌత్ ద‌ర్శ‌కుడు శంక‌ర్‌` అంటూ అత‌డిని త‌క్కువ చేసి చూపించిన జాతీయ మీడియా `2.ఓ` టీజ‌ర్‌ పై ఎలా స్పందించింది? ఎలాంటి రివ్యూలు రాసింది? అని వెతికితే.. ఆ రివ్యూల‌న్నీ చ‌ప్ప‌గానే ఉన్నాయి. 2.ఓ టీజ‌ర్ ఫ‌లానా విధంగా ఉంది అని వ‌ర్ణించ‌డంలోనూ ఏదో ఉందిలే అన్న‌ట్టే వ‌ర్ణిస్తూ రాసారు క్రిటిక్స్. అబ్బో మిరాకిల్‌ లా ఉంద‌ని కానీ, గొప్ప‌గా ఉంది అని కానీ రాయ‌లేదెవ‌రూ.. హిందూ - ఎన్డీటీవీ - ఇత‌రత్రా మీడియాలు రాసుకొచ్చిన రివ్యూలు చాలా రొటీన్‌గానే ఉన్నాయి. ఒక ర‌కంగా ద‌క్షిణాది గొప్ప‌త‌నాన్ని హ‌ర్షించేందుకు ఉత్త‌రాది మీడియాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండ‌వ‌న‌డానికి ఇంత‌కంటే ఎగ్జాంపుల్ అక్క‌ర్లేదు. క‌నీసం ధూమ్ 3 - రేస్ 3 పోస్ట‌ర్ల‌లాగా అయినా క‌నిపించ‌లేదా 2.ఓ టీజ‌ర్‌?

దేశంలోనే నేడు ఎమ‌ర్జింగ్ ఇండ‌స్ట్రీస్‌ లో స్టార్ డైరెక్ట‌ర్స్‌ గా టాప్ పొజిష‌న్‌ ని అందుకున్న ద‌ర్శ‌కులుగా శంక‌ర్ - ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి నీరాజ‌నాలు అందుకుంటున్నారు. వీళ్లు సినిమాలు తీస్తే బాలీవుడ్‌ కి సైతం దిమ్మ తిరిగిపోవాల్సిందేన‌న్న టాక్ జ‌నాల్లో ఉంది. కానీ జాతీయ మీడియా దానిని ఎప్పుడూ హైప్ చేయ‌దు. సోసోగానే క‌వ‌ర్ చేస్తూ లైట్ తీస్కుంటుంది. మేం ఆర్యులం.. మీరు ద్ర‌విడులు.. మేం ఎర్ర‌గా బుర్ర‌గా ఉంటే, మీరు న‌ల్ల‌గా రాక్ష‌స సంత‌తికి చెందిన వారిలాగా ఉంటార‌ని చ‌రిత్ర‌లోనే విభ‌జ‌న ఉంది. అది అన్నిటికీ వ‌ర్తింపజేస్తూ రాజ‌కీయాల్లో, సినిమాల్లో మేమే గొప్ప అన్న ఫీలింగ్‌ ని క‌లిగి ఉండే ఉత్త‌రాది వారి అహంకారానికి ఇదో నిద‌ర్శ‌నం. అస‌లు జాతీయ మీడియాకి మ‌న ద‌ర్శ‌కుల్లోని గొప్ప ఎప్ప‌టికీ క‌నిపించద‌నే చెప్పాలి. రేర్‌గా క‌ర‌ణ్ జోహార్ లాంటి క్రిటిక్ మాత్రం మ‌న ద‌క్షిణాది సినిమాల్ని ప్ర‌శంసిస్తూ - ప్ర‌చారం క‌ల్పిస్తూ ప్రోత్స‌హిస్తున్నారు. ఇత‌రులెవ‌రూ ప‌ట్టించుకున్న పాపాన కూడా పోరెందుకో!!
Tags:    

Similar News