ఎప్పుడూ పెద్ద నిర్మాతలు, వారి సినిమాలు, వారసత్వం హీరోలు అంటూ ఎగసిపడే ఆ చిన్న నిర్మాతగా నట్టి కుమార్ మాంచి పేరుంది. ఎప్పుడూ వారసులేనా హీరోలు అంటూనే ఆయన తన వారసుడిని దించుతున్నారు. ఇప్పుడు తన కొడుకును కూడా హీరోను చేస్తున్నాడు. అదేంటి సార్ నిర్మాత కొడుకు నిర్మాత అవ్వొచ్చుగా? అబ్బే అలా కాదులేండి.
చిన్న నిర్మాతల సంఘం అధ్యక్షుడు నట్టికుమార్ తనయుడు కూడా హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. అతడి పేరు నట్టి క్రాంతి.. ప్రస్తుతం క్రాంతి న్యూయార్క్ ఫిలిం ఇనిస్టిట్యూట్ లో నటశిక్షణ పొందుతున్నాడు. నటన, డ్యాన్సులు, ఫైట్స్ ఇలా అన్ని విభాగాలలో రాటుదేలుతున్నాడు. అతడి ఎంట్రీ 2016లో ఓ పెద్ద బ్యానర్ లో, పెద్ద దర్శకుడితో ఉంటుందని నట్టి కుమార్ చెబుతున్నారు. రేపు తన పుట్టినరోజు సందర్భంగా నట్టి పై సంగతిని చెప్పాడు. అందరూ అఖిల్ లు, చరణ్ లు కానక్కర్లేదు. కొందరు ధనుష్ లు పుట్టికొచ్చినా తప్పేం లేదు. పరిశ్రమ కేవలం వారసత్వ హీరోలదే కాదు. అందరిదీ.. అని పంచ్ వేస్తూనే.. ఆయన కూడా తన నాట వారసుడిని దించేస్తున్నారు.
మరి ఈ కుర్రాడు రేపు పెద్ద హీరో అయితే తన తండ్రి తిట్టిపోసిన ఆ పెద్ద నిర్మాతలతో సినిమాలు చేస్తాడో.. లేకపోతే మీకు నా డేట్లు ఇవ్వను అంటూ మొండికేస్తాడో.. అసలు ఆ పొజిషన్ కు వెళ్లాలంటే మున్ముందు చాలా ప్రూవ్ చేసుకోవాల్లే. వెయిట్ అండ్ సి.