మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ RRR విడుదలై మూడు వారాలవుతున్నా ఇంకా థియేటర్లు కిక్కిరి ఉన్నాయి. వీకెండ్స్ లో హౌస్ ఫుల్స్ అవుతుంటే ఇతర సమయాల్లోనూ రికార్డ్ స్థాయిలో రిపీటెడ్ ఆడియెన్ థియేటర్లకు వస్తుండడంతో వినోదం కోసం జనం ఎంతగా మొహం వాచి ఉన్నారో అర్థమవుతోంది. కరోనా క్రైసిస్ నేపథ్యంలో చాలామంది థియేటర్లకు వచ్చేందుకు సాహసించలేదు. అలాంటి వారు కూడా ఇప్పుడు ధీమాగా ధైర్యంగా థియేటర్లకు వచ్చి కుటుంబ సమేతంగా సినిమాల్ని ఆస్వాధిస్తున్నారు. మారిన మైండ్ సెట్ ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ చిత్రానికి ఒక రేంజులో కలిసొస్తోందని చెప్పాలి.
ఇక ఆర్.ఆర్.ఆర్ లో యాక్షన్ ఎపిసోడ్స్ భారీతనాన్ని విపరీతంగా ఆస్వాధిస్తున్న ఆడియెన్ కి ఇందులో నాటు నాటు లాంటి రిలీఫ్ మసాలా సాంగ్ కూడా ఉంది. అయితే ఈ పాటను కేవలం థియేటర్లలోనే కాదు ఇప్పుడు యూట్యూబ్ సోషల్ మీడియాల్లోనూ వీక్షించవచ్చు. తాజాగా చిత్రబృందం నాటు నాటు పూర్తి సాంగ్ ని విడుదల చేసింది.
మాస్ బీట్ లో ఇద్దరు అత్యుత్తమ డ్యాన్సర్లు దుమ్మురేపిన వైనాన్ని మర్చిపోలేరు ఎవరూ. రామ్ చరణ్ -ఎన్టీఆర్ అభిమానులు RRR లోని నాటు నాటు ప్రతి బిట్ ను ఆస్వాధిస్తున్నారు. నాటు నాటు పాట ట్రీట్ మరో లెవల్లో ఆస్వాధించేందుకు ఇకపై ఆస్కారం ఉంది. అభిమానులు ఇప్పుడు ఫోన్ లు వాట్సాప్ లలో ఈ వీడియోని వైరల్ గా షేర్ చేస్తున్నారు.
నాటు నాటు పూర్తి వీడియో పాటపై ఎంత క్రేజ్ ఉందో భారీ సంఖ్యలో లైక్ లు కామెంట్ లు చూస్తేనే అర్థమవుతోంది. చాలా మంది ఈ పాటను మెచ్చుకుంటూ తమ అభిమాన తారలను పొగిడేస్తూ వ్యాఖ్యలను జోడించారు. ఆ ఇద్దరిలో ఎవరు బాగా డ్యాన్స్ చేశారు..? ఎవరు బాగా చేయలేదు? ఎవరు ఈ మూవీలో అద్భుతంగా నటించారనే దానిపై ట్విట్టర్ వేదికగా వార్ నడుస్తోంది.
కొందరు అయితే ఇద్దరు తారల డ్యాన్స్ కదలికల మధ్య సింక్ కాని స్టెప్స్ ని తేడాలను ఎత్తి చూపుతున్నారు. రాజమౌళి అలాంటి వాటిని విస్మరించినందుకు నిందించారు. హ్యాండ్ తిప్పే భంగిమల నుండి జంప్ చేసే మూవ్ ల వరకు నాటు నాటు అభిమానులు ఎన్టీఆర్ - రామ్ చరణ్ ల నృత్య కదలికల మధ్య చాలా తేడాలను కనుగొన్నారు. మాస్టర్ మైండ్ రాజమౌళి చాలా టేక్ లు పర్ఫెక్ట్ గా సింక్ తో ఉన్నాయని భావిస్తే అది తప్పు అని చాలా మంది విశ్లేషించారు. ఇంకా చాలా లోటుపాట్లను అభిమానులు ఎత్తి చూపుతున్నారు.
నిజానికి ఎంత పెద్ద దర్శకుడికి అయినా మల్టీస్టారర్లు తీయడం అంటేనే పెద్ద సవాల్. ఇందులో హెచ్చు తగ్గులు అనేవి బయటపడుతుంటాయి. ఇరువురు హీరోల్ని సమప్రాధాన్యతతో చూపించడం అంత సులువేమీ కాదు. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ కాగానే ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. తారక్ ని సెకండ్ హీరోలా చూపించారని కామెంట్లు చేశారు. ఇప్పుడు నాటు నాటు పాట మేకింగ్ లో లోపాల్ని కనిపెట్టి చెబుతున్నారు ఫ్యాన్స్. కానీ అభిమానులు గమనించిన వాటి గురించి ఇప్పుడు జక్కన్న దృష్టికి వెళుతుందనడంలో సందేహం లేదు. నాటు నాటు ఇప్పటివరకు లక్షలాది వీక్షణలతో దూసుకెళుతోంది. అన్ని భాషల్లోనూ ఈ పాట విడివిడిగా విడుదలై ఆదరణ పొందుతోంది.
Full View