కొత్తదనం నిండిన కథల్ని..కొత్త దర్శకుల్ని పరిచయం చేయడంలో నేచురల్ స్టార్ నాని ఎప్పుడు ముందుంటారు. కథ..ఆ కథని ఎగ్జిక్యూట్ చేయగల నమ్మకం ఉంటే నానితో ఛాన్స్ ఖాయం చేసుకోవచ్చు. నాని ద్వారా పరిచయం అయిన దర్శకులు కొంత మంది ఉన్నారు. ప్రస్తుతం వాళ్లంతా మేకర్స్ గా బిజీ అవుతున్నారు.
బేసిక్ గా నాని అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా రావడంతోనే? తనలో ఈ క్వాలిటీ బలంగా కనిపిస్తుంది. కథని జడ్డ్ చేయడం.. దాన్ని అతను అనుకున్నది అనుకుట్నట్లు తెరకెక్కించగలడా? అన్నది నాని ముందే పసిగట్టగల నేర్పరి. నాని సక్సెస్ కి కొత్త వాళ్ల ఎంపిక అన్నది ఓ సీక్రెట్ గా చెప్పొచ్చు. ఇండస్ర్టీలో నాని వారసుల పోటీని తట్టుకుని నిలబడ్డాడు? అంటే ప్రధానమైన కారణం తనలో ఈ లక్ష్మణమే.
అయితే కొత్త వాళ్లు నాని పరీక్షలో పాస్ అవ్వడం కూడా అంత వీజీ కాదు. అన్ని రకాల టెస్టులు పాసైన తర్వాతే ఛాన్స్. ప్రస్తుతం నాని కథానాయకుడిగా నటిస్తోన్న `దసరా` సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా మరో కొత్త దర్శకుడ్ని పరిచయం చేసే బాధ్యత నాని మరోసారి తీసుకున్నాడు.
ఇటీవలే ఆ యువ మేకర్ చెప్పిన కథని నాని లాక్ చేసాడుట. స్ర్కిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిందని నాని ఖాళీ అవ్వగానే ప్రాజెక్ట్ పట్టాలెక్కించడమవే ఆలస్యం అంటున్నారు. ఈ సినిమా కి మోహన్ చెరుకూరి ని నిర్మాతగా ఫైనల్ చేసారు. అయితే ఆ దర్శకుడు ఎవరు? అన్న వివరాలు మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. ఇండస్ర్టీలో అతని అనుభవం ఏంటి? అన్నది క్లారిటీ లేదు.
ఈ విషయాలన్నింటిపై నాని అధికారికంగా స్పందిస్తారని సమాచారం. అయితే దసరా రిలీజ్ ముందు మాత్రమే ఇది జరుగుతుందని తెలుస్తుంది. దసరాని వచ్చే ఏడాది మార్చి 30న రిలీజ్ చేయనున్నారు. అంతకు ముందు ప్రాజెకట్ ప్రకటించి..రిలీజ్ తర్వాత పట్టాలెక్కించనున్నారని సమాచారం. ఇలా సినిమాలైతే చేస్తున్నాడు గానీ నాని సక్సెస్ రుచి చూసి చాలా కాలమవుతోంది.
`జెర్సీ` తర్వాత సరైస సక్సెస్ పడని సంగతి తెలిసిందే. ఆ తర్వాత రిలీజ్ అయిన ఐదు సినిమాలు ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఈ నేపథ్యంలో నానికి సక్సెస్ అనివార్యమైన సమయం ఇది. ఇప్పటికే నాని సినిమాలపై మార్కెట్ పరంగా ప్రతికూల పరిస్థితులు తలెత్తుతున్నాయని లీకులందుతున్నాయి. ఇదే కొనసాగితే మరింత డ్యామేజ్ జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో `దసరా` విజయం నాని కెరీర్ లో కీకలంగా మారబోతుంది.