సంధ్యారాజు ప్రధాన పాత్రలో నాట్యం అనే యూట్యూబ్ మూవీ రిలీజ్ కానుంది. కళ్యాణి అనే కూచిపూడి నాట్యకారిణి జీవితమే ఈ ఫిలింస్టోరీ. పెళ్లి తర్వాత ఎంతో ఇష్టమైన నాట్యాన్ని వదిలేయాల్సి వచ్చిన పరిస్థితులను 40 నిమిషాల మినీ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు.
ఈ నాట్యం సినిమాకు తన రియల్ లైఫ్ కు అసలే మాత్రం సంబంధం లేదని చెబుతోంది సంధ్యా రాజు. అయితే, ఇలాంటి పరిస్థితి ఎదుర్కున్న ఎంతోమందిని తాను చాలా దగ్గరి నుంచి చూశానంటోంది. నాట్యం అంటే ఎంతో ఇష్టం ఉన్నా.. ఇంట్లో వాళ్ల ఒత్తిడి కారణంగా దాన్ని వదిలేసి ఇంజినీరింగ్ - మెడిసిన్ చదువుకున్న చాలామంది ఫ్రెండ్స్, చుట్టాలు తనకు తెలుసని చెప్పింది. ఇప్పటికీ నాట్యం కొనసాగిస్తున్న ఈమె.. ఇప్పటి నుంచి ఓ పదేళ్ల తర్వాత నాట్యం వదిలేయాల్సి వస్తే అనే ఆలోచనే ఎంతో బాధను కలిగిస్తుందని అంటోంది.
యూట్యూబ్ లో సంధ్యా రాజు డ్యాన్స్ వీడియోలను చూసి ఈమెను ఈ పాత్రకు ఎంపిక చేశారు డైరెక్టర్ రేవంత్. నాలుగేళ్ల క్రితం దేవస్థానం అనే సినిమాకు టైటిల్ సాంగ్ కోసం పెర్ఫామ్ చేశానని, అయితే నాట్యం సినిమాలో పూర్తి స్థాయి పాత్ర చేయడం మాత్రం తనకు చాలా కొత్తగానే ఉందని చెబుతోంది. ఇలా యూట్యూబ్ లో తన మూవీ రిలీజ్ కానుండడం ఆశ్చర్యంగానే ఉన్నా బాధపడ్డం లేదట. ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో రిలీజ్ చేస్తే, చూసే ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉండేదని, కానీ యూట్యూబ్ లాంటి డిజిటల్ మీడియా కారణంగా.. ప్రపంచం మొత్తం దీన్ని చూస్తుందని చెబుతోంది సంధ్యా రాజు.