ఒక్క షో ఆడని సినిమాకు థియేటర్లు అవసరమా అన్నారట!

Update: 2019-07-08 01:30 GMT
రెండు వారాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' కమర్షియల్‌ సక్సెస్‌ ను దక్కించుకుంది. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రంకు స్టార్స్‌ ప్రమోషన్‌ కలిసి వచ్చింది. దాంతో పాటు సినిమాలో మ్యాటర్‌ ఉందంటూ రివ్యూలు రావడం మరియు పబ్లిక్‌ టాక్‌ పాజిటివ్‌ గా రావడంతో మంచి వసూళ్లనే నమోదు చేసింది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులు సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు.

సక్సెస్‌ మీట్‌ లో నిర్మాత రాహుల్‌ యాదవ్‌ నక్క మాట్లాడుతూ ఈ రోజుల్లో సినిమాను నిర్మించడం కంటే దాన్ని విడుదల చేయడం చాలా కష్టంగా మారింది. మా సినిమాకు థియేటర్లు కావాలని కొందరు ఎగ్జిబ్యూటర్లను కోరినప్పుడు ఒక్క షో కే తీసేసే సినిమాకు థియేటర్లు అవసరమా అన్నట్లుగా అవమానకరంగా మాట్లాడారు. అలాంటి మా సినిమా మూడవ వారంలో కూడా విజయవంతంగా ప్రదర్శింపబడుతుందని అన్నాడు.

ఈ చిత్రం కథను హీరో నవీన్‌ ను దృష్టిలో పెట్టుకుని రాశానని.. అతడు ఓకే చెప్తేనే సినిమా చేయాలని భావించానని దర్శకుడు స్వరూప్‌ అన్నాడు. ఈ సినిమా కోసం హీరో నవీన్‌ కు ఫేస్‌ బుక్‌ ద్వారా మెసేజ్‌ పెడితే రెండు నెలలకు రెస్పాండ్‌ అయ్యాడు. కథ సినాప్సిస్‌ ను పంపించమన్నాడు. ఈ కథ కోసం ఇద్దరం సంవత్సరం కలిసి ట్రావెల్‌ చేసి స్క్రిప్ట్‌ ను రెడీ చేశాం. ఈ సినిమా కోసం పని చేసిన అందరం కూడా 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' సిరీస్‌ లో చాలా సినిమాలు చేయాలని భావిస్తున్నాం. ముందు ముందు ఈ సిరీస్‌ లో చాలా సినిమాలు రానున్నాయని దర్శకుడు స్వరూప్‌ చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News