రామ్ చరణ్ కల ఎట్టకేలకు నెరవేరింది. అమెరికాలో చరణ్ కు తొలి మిలియన్ క్లబ్ మూవీ ‘ధృవ’ రికార్డు సాధించింది. బలమైన కంటెంట్ ఉన్న సినిమానే అయినా.. చరణ్ వీక్ గా ఉన్న అమెరికాలో మిలియన్ మార్కును అందుకోవడం చిన్న విషయమేమీ కాదు. ఐతే సినిమాను అమెరికాలో బాగా ప్రమోట్ చేసి.. మంచి ఏరియాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయడం సినిమాకు కలిసొచ్చింది. ఈ విషయంలో ఈ సినిమాతో సంబంధం లేని ఓ వ్యక్తికి క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అతనే నవీన్ ఎర్నేని. మైత్రీ మూవీ మేకర్స్ ముగ్గురు అధినేతల్లో ఒకరు ఈ నవీన్.
‘ధృవ’ కోసం చరణ్ యుఎస్ లో ప్రమోషన్లలో పాల్గొన్నపుడు అతడి వెంటే కనిపించాడు నవీన్. ‘ధృవ’ డిస్ట్రిబ్యూషన్ విషయంలో ప్రతి విషయం దగ్గరుండి చూసుకున్నాడు నవీన్. ఈ సినిమాకు మంచి థియేటర్లు లభించేలా చేయడం.. పబ్లిసిటీ బాగా చేయడంలో నవీన్ పాత్ర కీలకం. చరణ్ యుఎస్ టూర్ మొత్తాన్ని ఆర్గనైజ్ చేసింది కూడా నవీనే. ఆయన ఇలా చేయడంలో కొంచెం స్వార్థం కూడా ఉంది. సుకుమార్ దర్శకత్వంలో చరణ్ తర్వాతి సినిమాను నిర్మించబోయేది మైత్రీ మూవీ మేకర్సే. ‘ధృవ’ అమెరికాలో బాగా ఆడితేనే.. వాళ్ల సినిమాకు హైప్ వస్తుంది. అందుకే నవీన్ పనిగట్టుకుని ‘ధృవ’కు అమెరికాలో మంచి ఆదరణ దక్కేలా చూశాడు. ఆయన ప్రయత్నం బాగానే ఫలించింది. చరణ్ తొలిసారి మిలియన్ మార్కును అందుకున్నాడు. ఇక సుకుమార్ సినిమాలంటే మామూలుగానే అమెరికాలో మంచి ఆదరణ పొందుతాయి కాబట్టి.. చరణ్ తో అతను చేసే సినిమాకు మరింత హైప్ వచ్చే అవకాశముంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/