25 కోట్లు ఇచ్చినా అలాంటి పాత్రలు చేయడట

Update: 2023-01-05 02:30 GMT
కొంతమంది నటినటులు సినిమాల్లో వారి క్యారెక్టర్స్ ను సెలెక్ట్ చేసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్టార్ హోదా పెరిగిన తర్వాత అన్ని వర్గాల వారిని డిఫరెంట్ గా కట్టుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. రెగ్యులర్ కమర్షియల్ రోల్స్ కు చాలా దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు.

మరికొన్నిసార్లు సింపుల్ క్యారెక్టర్స్ చేసినా కూడా ఎక్కువ స్థాయిలో పారితోషికం ఇస్తామని టెంప్ట్ చేస్తూ ఉంటారు. అయినా కూడా కొందరు నటీనటులు దాని గురించి పెద్దగా పట్టించుకోరు. ఇక అలాంటి కొద్దిమంది నటులలో నవాజుద్దీన్ సిద్ధికి ఒకరు. టాలెంటెడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ తన కెరీర్‌లో ఎన్నో ప్రత్యేకమైన పాత్రలు పోషించాడు.

తన అంకితభావం ప్రతిభతో ఈ నటుడు తన కెరీర్‌లో చాలా పైకి వచ్చాడు. గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్, బద్లాపూర్, ది లంచ్ బాక్స్, బజరంగీ భాయిజాన్ వంటి అనేక సినిమాలలో అతను చేసిన పాత్రలకు మంచి గుర్తింపు లబించింది. ఇక ఇటీవలి ఇంటర్వ్యూలో, నవాజుద్దీన్ చిన్న తరహా పాత్రలు పోషించడం నచ్చదని అలాగే మేకర్స్ తనకు 25 కోట్లు ఆఫర్ చేసినా ఇకపై చిన్న పాత్రలు పోషించనని చెప్పాడు.

కీర్తి  డబ్బు ఒక నటుడి పని యొక్క ఉప ఉత్పత్తులు మాత్రమే అని నవాజుద్దీన్ అభిప్రాయపడ్డాడు. నటీనటులు తమ పనిని చక్కగా చేస్తే డబ్బు, పేరు ప్రతిష్టలు వారి వెంటే ఉంటాయని నవాజుద్దీన్ చెప్పారు.  ఎవరైనా సరే డబ్బుపై మితిమీరిన దృష్టి పెడితే చివరకు ఏమీ మిగలదని ఆయన అన్నారు.

నవాజుద్దీన్ ఇంకా మాట్లాడుతూ డబ్బు మన స్థాయిని నిర్ణయించడం కంటే మన క్యారెక్టర్ తో ఎక్కువ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలి అని అన్నారు. ఇక ప్రస్తుతం అయితే ఈ నటుడు కొన్ని బాలీవుడ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాడు. ఇక చిన్న బడ్జెట్ సినిమాలో అయినా సరే తన క్యారెక్టర్ బలంగా ఉంటే తక్కువ పారితోషికం ఇచ్చినా కూడా చేయడానికి సిద్ధమే అని అంటున్నాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News