మనోడు ట్యాలెంట్ చూపించడానికి రీజన్

Update: 2016-05-12 06:09 GMT
బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రస్తుతం చాలా బిజీ అయిపోయాడు. లంచ్ బాక్స్ - భజరంగీ భాయ్ జాన్ తర్వాత తెగ ఆఫర్స్ వచ్చిపడుతున్నాయి. ఇప్పుడు ఓ డజన్ సినిమాల్లో చేసేస్తున్నాడంటే.. సిద్ధికీ స్పీడ్ అర్ధమవుతుంది. అయితే, ఎన్ని సినిమాలు చేసినా ఆ పాత్రలు అన్నిటినీ విభిన్నంగా చేసి మెప్పించడం నవాజుద్దీన్ స్పెషాలిటీ.

మరి ఇలా కేరక్టర్లను మెప్పించేందుకు ఈ ట్యాలెంటెడ్ యాక్టర్ ఎలా సిద్ధమవుతాడనే ప్రశ్న తలెత్తడం సహజం. అయితే.. దీనికి సిద్ధిఖీ ఇచ్చిన ఆన్సర్ కూడా డిఫరెంట్ గానే ఉంది. 'ఓ కేరక్టర్ చేయడానికి రెడీ అవడం అనేది డైరెక్టర్ పై ఆధారపడుతుంది. కొన్ని సార్లు ఆయా పాత్రలే మనల్ని సిద్ధం చేస్తాయి. కొన్నిటికి అసలు ఏం చేయనక్కర్లేదు. డైరెక్టర్ చెప్పింది వింటే చాలు. నేను తెలివైనవాడిని కాదని నాకు తెలుసు. అందుకే దర్శకుడు చెప్పినట్లు చేయడానికే ప్రయత్నిస్తా' అంటున్నాడు ఈ ట్యాలెంటెడ్ యాక్టర్.

ప్రస్తుతం చేస్తున్న రామన్ రాఘవ్ 2.0 కోసం మాత్రం కొంత ఎక్కువగానే కష్టపడాల్సి వచ్చిందట. పాత్రకు అలవాటు పడేందుకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రెండు రోజులు వెళ్లిపోయాడట. ఆ తర్వాత హాస్పిటల్ పాలైనప్పుడు.. స్పృహలో లేని సమయంలో డైలాగ్స్ చెప్పడం చూసి నవాజుద్దీన్ భార్య బోలెడు కంగారు పడిపోయిందట. మొత్తానికి తన ట్యాలెంట్ కి రీజన్ మాత్రం డైరెక్టర్ అని ఓపెన్ గానే చెప్పేశాడు నవాజుద్దీన్ సిద్దిఖీ.
Tags:    

Similar News