తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి పాపులారిటీ దక్కించుకుని లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ ను దక్కించుకున్న నయనతార దీపావళి సందర్బంగా ముక్కుత్తి అమ్మన్ సినిమాతో హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఈ సినిమా అమ్మోరు తల్లిగా డబ్ అయిన విషయం తెల్సిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సూపర్ డూపర్ హిట్ అన్నట్లుగా కాకుండా పర్వాలేదు ఒక్కసారి చూడవచ్చు. దేవుళ్ల పేరుతో భక్తులను దొంగ బాబాలు ఎలా మోసం చేస్తున్నారు భక్తులు కూడా ఎంత కమర్షియల్ అయ్యారు అనే విషయాన్ని చాలా ఫన్నీగా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు.
ప్రముఖ తమిళ నటుడు ఆర్ జే బాలాజీ ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆర్ జే బాలాజీతో పాటు ఎన్ జే శరవనన్ కూడా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. నయనతార ముక్కు పుడక అమ్మవారిగా కనిపించారు. అమ్మవారు అంటే సినిమా మొత్తం నయనతార త్రిషూలం కిరీటం పెట్టుకుని కనిపించకుండా ఒక నిండైన మహిళ పాత్రలో నయన్ కనిపించింది. అమ్మవారిగా నయన్ నూటికి నూరు పాళ్లు బాగా సెట్ అయ్యింది అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేవతగా ఆమె వ్యంగ్య మాటలు మరియు హావభావాలు కూడా శృతి మించకుండా నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి. నయనతార ఈ సినిమాతో మరోసారి లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ కు న్యాయం చేసుకుంది అంటూ తమిళ నయన్ ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
సినిమా మొదటి సగం చాలా ఎంటర్ టైనర్ గా ఆకట్టుకునే విధంగా సాగింది. సెకండ్ హాఫ్ లో కాస్త సీరియస్ నోడ్ కు మారడంతో ప్రేక్షకులు కాస్త బోర్ ఫీల్ అవుతారు. అయితే సినిమా ఓవరాల్ గా మాత్రం పర్వాలేదు ఒకసారి చూడదగ్గట్లుగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ నెటిజన్స్ తమ మనోగతంను వ్యక్తం చేస్తున్నారు. ఓటీటీ ద్వారా ఇటీవలే విడుదలైన ఆకాశమంత సినిమాకు ఇది పోటీ ఇస్తుందా అంటే దేనికి అదే అన్నట్లుగా ఉన్నాయి.
ఎంటర్ టైనర్ కావాంటే ఈ సినిమా ఒక్కసారి చూడచ్చు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నయన్ అమ్మవారిగా పూర్తిగా నిరాశపర్చకున్నా ఒక మోస్తరుగా ఆకట్టుకుందంటున్నారు. తమిళ ఆడియన్స్ ఇలాంటి సినిమాలకు బ్రహ్మరథం పడతారు. కాని తెలుగు ప్రేక్షకులు మాత్రం అంతకు మించి కావాలనుకుంటారు. అందుకే ఈ సినిమా తెలుగులో యావరేజ్ గా నిలిచి వన్ టైమ్ వాచ్ మూవీ టాక్ ను సొంతం చేసుకుంది.