సహజంగా హీరోయిన్లకు పెళ్లి కాగానే వారికి డిమాండ్ తగ్గుతుంది. సినిమా అవకాశాలతోపాటు రెమ్యూనరేషన్ కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా పెద్ద సినిమాల్లో అవకాశాలు కూడా సన్నగిల్లుతాయి. కానీ అందాల భామ నయనతార మాత్రం పెళ్లయినా తన హవా కొనసాగిస్తోంది. పైగా పెళ్లికి ముందు కంటే ఇప్పుడు జోరు పెంచేసింది. తన రెమ్యూనరేషన్ ను అమాంతం పెంచేసిందని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం నయనతార తన 75వ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో నటిస్తున్నందుకు తనకు ఏకంగా 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
నయనతార 75వ చిత్రాన్ని జీ స్టూడియోస్, నాడ్ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నీలేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం కొద్ది రోజుల క్రితం జరిగింది. ఇందులో జై, సత్యరాజ్ తదితరులు నటిస్తున్నారు.
కాగా ఇప్పటివరకు నయనతార రెమ్యూనరేషన్ 5- 6 కోట్ల రూపాయల మధ్య ఉందని సమాచారం. అలాంటిది ఏకంగా పెళ్లి తర్వాత నాలుగు కోట్ల రూపాయల పారితోషికాన్ని పెంచేసిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ భామ నటిస్తున్న 75వ చిత్రానికి రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం నయనతార చేతిలో అగ్ర హీరోల చిత్రాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న గాడ్ ఫాదర్ తోపాటు, అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా వస్తున్న చిత్రంలో నయనతార నటిస్తోంది.
అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన ఒక మలయాళ చిత్రంలోనూ చేస్తోంది. ఈ నేపథ్యంలో నయనతార రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది.