అదేంటో కొన్ని అంచనాలకు అందవు. పక్క బాషలోనో రాష్ట్రంలోనో బాగా ఆడిన సినిమాలు మన దగ్గరకు వచ్చేటప్పటికి నేటివిటి కారణంతోనో లేదా సబ్జెక్టులో ఉన్న లోపాల వల్లనో ఆశించిన ఫలితాన్ని అందుకోలేక చతికిలబడతాయి. అలాంటిదే నయనతార నటించిన వాసుకి. ఇదెప్పుడు వచ్చింది అనుకుంటున్నారా. రెగ్యులర్ గా సినిమాలు చూసేవాళ్లుకు తెలిసే ఉంటుంది కానీ మూడేళ్ళ క్రితం వచ్చిన ఈ డబ్బింగ్ మూవీ ఇక్కడ కనీస స్థాయిలో ఆడలేదు.
మమ్ముట్టి లాంటి స్టార్ హీరో ఉన్నా మనవాళ్ళు పట్టించుకోలేదు. లైంగిక వేధింపుల నేపథ్యంలో ఓ గృహిణి చేసే అసాధారణ పోరాటాన్ని నేపధ్యంగా తీసుకుని నిర్మించిన ఈ మూవీ మలయాళంలో పుతియ నిర్ణయం పేరుతో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. నయన్ కు బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిలిం ఫేర్ అవార్డు కూడా ఇచ్చింది
ఇప్పుడీ సినిమా బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు. ఎవరో ఆషామాషీ దర్శకుడు కాదు. ఏ వెడ్నెస్ డే-బేబీ-స్పెషల్ చబ్బీస్-ఏంఎస్ ధోని లాంటి కల్ట్ మూవీస్ ని రూపొందించిన నీరజ్ పాండే దీన్ని టేకప్ చేయబోతున్నారు. గత ఏడాది అయారి రూపంలో నీరజ్ కు పెద్ద షాక్ తగిలింది. ఎన్నో అంచనాలు పెట్టుకుంటే డిజాస్టర్ అయ్యింది. అందుకేనేమో ఈసారి వాసుకిని ఎంచుకున్నారు. నయనతార పాత్రను ఎవరు పోషిస్తారో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. పక్కింటి కుర్రాళ్ళ చేతిలో రేప్ కు గురయ్యే పాత్ర అంటే అంత ఈజీగా ఎవరైనా ఒప్పుకుంటారా. అదేదో నయన్ చేస్తే పోలా