నాలుగు అయిదు సంవత్సరాలుగా నయనతార మరియు విఘ్నేష్ శివన్ ల యొక్క పెళ్లి గురించి మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇద్దరు ప్రేమలో ఉన్నారు అనే విషయాన్ని కూడా చాలా కాలం వరకు దాచారు. ఇద్దరు కలిసి పదే పదే బయట కనిపించడం.. పార్టీలకు ఫంక్షన్ కు హాజరు అవ్వడం వల్ల ఇద్దరి ప్రేమ వ్యవహారం గురించి క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత తర్వాత ఇద్దరు మీ క్లోజ్ అవ్వడం తో తమ ప్రేమ వ్యవహారం ను చెప్పకనే చెప్పేశారు.
ఇద్దరు బాహాటంగానే ప్రేమించుకోవడంతో పెళ్లి ఎప్పుడు అంటూ చర్చ మొదలు అయ్యింది. ఎట్టకేలకు పెళ్లికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. జూన్ 9వ తారీకున సింపుల్ గా తిరుమల శ్రీవారి సన్నిధిలో వివాహం కి సిద్దం అయ్యారు. ఇద్దరికి కూడా తిరుమల శ్రీవారు అంటూ చాలా భక్తి మరియు ఇష్టం. అందుకే పెళ్లిని తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇరు వైపుల కుటుంబ సభ్యులు సన్నిహితులు మొత్తంగా 50 నుండి 60 మంది వరకు పెళ్లికి హాజరు అయ్యే అవకాశం ఉందని తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
పెళ్లికి సంబంధించిన హడావుడి ఇప్పటికే మొదలు అయ్యింది. నయన్ కుటుంబ సభ్యులు ఇప్పటికే పెళ్లి కోసం తిరుపతిలో ఏర్పాట్లు చేయడం తో పాటు.. పెళ్లి తర్వాత రిసెప్షన్ ను కూడా నిర్వహించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారట.
రిసెప్షన్ తమిళనాడు చెన్నైలో ఉంటుందని తెలుస్తోంది. అంతే కాకుండా నయనతార స్నేహితులు మరియు ఇతర బంధువుల కోసం కేరళలో కూడా పెళ్లికి సంబంధించిన వేడుక నిర్వహించే అవకాశాలు ఉన్నాయట. మొదట పెళ్లి హిందూ మరియు క్రిస్టియన్ పద్దతిలో జరుగబోతుందని వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పెళ్లి కేవలం హిందూ మత సంప్రదాయం ప్రకారం మాత్రమే జరుగబోతుంది.
పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు తిరుమల దేవస్థానం వారు చేశారట. ఆ తేదీలో ప్రత్యేక దర్శణం ను చేసుకునేందుకు కూడా స్లాట్ ను బుక్ చేశారట. నయనతార మరియు విఘ్నేష్ శివన్ ల పెళ్లి రోజున తిరుమల కొండపై సెక్యూరిటీ పెంచే ఆలోచన కూడా ఉందట. మొత్తానికి చాలా సింపుల్ గా పెళ్లి జరిగినా కూడా వార్తల్లో మాత్రం పతాక స్థాయిలోనే నిలిచే అవకాశం ఉంది.