బాబోయ్‌.. మరీ రూ.10 కోట్లు ఏంటీ అమ్మడు?

Update: 2021-05-24 02:30 GMT
బాలీవుడ్‌ లో హీరోయిన్స్ పారితోషికంతో పోల్చితే సౌత్‌ హీరోయిన్స్ పారితోషికం ఓ నాలుగు అయిదు సంవత్సరాల ముందు వరకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉండేది. కోటిన్నర రెండు కోట్లు సౌత్‌ హీరోయిన్స్ తీసుకుంటేనే గ్రేట్‌.. స్టార్‌ హీరోయిన్‌ అన్నట్లుగా చూసేవారు. కాని అదే సమయంలో పది కోట్ల వరకు బాలీవుడ్‌ హీరోయిన్స్ తీసుకునే వారు. ఇప్పటికి కూడా పరిస్థితి అలాగే ఉంది కాని తేడా మాత్రం కాస్త తగ్గింది. బాలీవుడ్‌ హీరోయిన్స్ తో పోల్చితే కాస్త అటు ఇటుగానే మన హీరోయిన్స్ కూడా పారితోషికంను అందుకుంటున్నారు. కాని బాలీవుడ్‌ ను మించిన పారితోషికం ను సౌత్‌ లేడీ సూపర్ స్టార్‌ నయనతార అందుకునేందుకు ఆరాట పడుతోంది.

లేడీ సూపర్ స్టార్‌ నయనతార నటించిన 'నేట్రికన్‌' విడుదలకు సిద్దం అయ్యింది. ప్రముఖ ఓటీటీ ఈసినిమాను డైరెక్ట్‌ రిలీజ్‌ చేసేందుకు గాను దాదాపుగా రూ.20 కోట్ల కు గాను కొనుగోలు చేసిందట. విఘ్నేష్‌ శివన్‌ తో కలిసి నయన్‌ స్వయంగా ఈ సినిమాను నిర్మించిన విషయం తెల్సిందే. ఈ సినిమా ఒక కొరియన్‌ మూవీ స్ఫూర్తితో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా లో నయన్‌ నటన అద్బుతంగా ఉంటుందని అంటున్నారు. సినిమాకు వచ్చిన హైప్‌ నేపథ్యంలో ఈ సినిమాను భారీ మొత్తంకు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. 20 కోట్లు ఓటీటీ.. మరో 10 కోట్లు ఇతర రైట్స్‌ ద్వారా రాబోతున్నాయి.

తన మార్కెట్‌ రూ.30 నుండి రూ.40 కోట్లకు పెరిగిన నేపథ్యంలో తన పారితోషికంను ఏకంగా రూ.10 కోట్లకు పెంచాలని నిర్ణయించుకుందట. నాలుగు నుండి అయిదు కోట్ల వరకు ఈమె పారితోషికంను తీసుకుంటుంది. ఇప్పుడు దాన్ని రెట్టింపు చేసింది. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేయాలంటే ఇకపై రూ.10 కోట్లు ఇవ్వాల్సిందే అంటూ నయన్‌ డిమాండ్ చేయబోతుందట. సౌత్‌ సినిమా హీరోయిన్‌ మరీ పది కోట్లు ఏంటీ అంటూ మేకర్స్‌ ముక్కున వేలేసుకుంటున్నారు.




Tags:    

Similar News