ఫోటో స్టోరి: కేరళ చీరకట్టులో భామలు భలే

Update: 2016-09-14 10:06 GMT
కేరళ వారికి ఓనమ్ పండుగ అనేది చాలా ముఖ్యమైన పర్వదినం. అక్కడ కులమతాలకు అతీతంగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. రాజు మహాబలి (తెలుగులో బలి చక్రవర్తి) అక్కడి నేలను చూడ్డానికి ప్రతీ సంవత్సరం ఈ రోజున ఒక్కసారి స్వర్గం నుండి విచ్చేస్తాడని పురాణం చెబుతుంది. అందుకే ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు.

ఇక ఓనమ్ లో ముఖ్యంగా అమ్మాయిలు అయితే.. బంగారు అంచుతో ఉండే తెల్లటి చీరను ధరించి.. అక్కడ తిరువతిరకళి అనే నాట్యం చేస్తుంటారు. సినిమాల్లో కూడా చాలాసార్లు ఈ నృత్యాలను మనం చూస్తూనే ఉంటాం. డ్యాన్స్ సంగతేమో కాని ట్రెడిషనల్ కేరళ చీరలను కట్టుకుని.. సాంప్రదాయబద్దంగా రెడీ అయిన మన మలయాళ కుట్టీలు.. తమ చీరకట్టుతో చంపేస్తున్నారంతే. ఈ రోజు ఉదయం నయనతార ఎలా రెడీ అయ్యిందో చూడండి. అమ్మడు కేరళలతో తన పేరెంట్స్ తో కలసి సెలబ్రేట్ చేసుకుంటోందట. ఇక మరో హీరోయిన్ పూర్ణ (షామ్నా కాసిమ్) కూడా అంతే. ఆ ఫోటోలను చూస్తే మీకే అర్ధమవుతోందిగా.. చీరకట్టులో భామలు భలే అనకమానరు.

పుట్టుకతో క్రిస్టియన్ అయిన నయనతార.. అలాగే ముస్లిం అయిన పూర్ణ.. ఇలా 'ఓనమ్' పండుగను జరుపుకుంటూ.. భారతదేశపు సెక్యులర్ ఫ్యాబ్రిక్ తాలూకు ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుతున్నారు కదూ. వెల్ డన్.
Tags:    

Similar News