పెళ్లికి రాని అత్త‌మ్మ‌..విగ్నేష్ కాళ్ల‌పై నీళ్లు పోసిందెవ‌రు?

Update: 2022-06-16 04:30 GMT
ప్రేమించిన చెలికాడు విగ్నేష్ శివ‌న్ ని వివాహం చేసుకోవ‌డానికి న‌య‌నతార  ఎన్ని రకాల త్యాగాలు చేసిందో  చెప్పాల్సిన ప‌నిలేదు. క్రైస్త‌వ మ‌తం నుంచి హిందు మ‌తంలోకి మారారు. ఇది ఎంతో పెద్ద సాహ‌స‌మ‌నే చెప్పాలి. ప్రియుడు కోసం మ‌తం మారారంటే? ఆమె ఎంత‌గా ప్రేమిస్తున్నారో..ఆప్రేమ‌కి సూచిక‌గా తెలుస్తుంది.

అటుపై వివాహానికి అడ్డంకులు ఏర్ప‌డ‌టంతో వాటిని తొల‌గించ‌డం కోసం జ్యో తిష్య శాస్ర్తం ప్రకారం నివార‌ణ పూజ‌ల‌న్నింటిని  ఎంతో నియ‌మ‌ నిష్ట‌ల‌తో  దిగ్విజ‌యంగా పూర్తిచేసారు. దేశంలో ఉన్న హిందు వేవాల‌యాలు అన్నింటిని ప్రియుడితో క‌లిసి చుట్టేసింది. ఇదంతా త‌న మ‌న‌సుకిష్ట‌మై చేసిందా?  లేక ప్రియుడు కోస‌మేనా? అన్న‌ది ఆమె అంత‌ర్మ‌ధ‌నానికి వ‌దిలేయాలి.

ఇలా విగ్నేష్ ని వివాహం చేసుకోవ‌డం కోసం న‌య‌న్  త‌న మన‌సుతో సైతం పెద్ద యుద్ధ‌మే చేసింది. అయితే ఈపెళ్లిలో ఎక్క‌డా న‌య‌న‌తార త‌ల్లి ఓమ‌న్ కురియ‌న్ క‌నిపించ‌లేదు. న‌య‌న్ కుటుంబ స‌భ్యులు..బంధువులు..స్నేహితులు.. సెల‌బ్రిటీలు అంతా క‌నిపించారు గానీ ఓమ‌న్ మాత్రం క‌నిపించ‌లేదు. కుమార్తె పెళ్లిని ద‌గ్గ‌రుండి జ‌రింప‌చాల్సిన త‌ల్లి ఆ స‌మ‌యందో ద‌గ్గ‌ర లేక‌పోవ‌డం శోచ‌నీయ‌మే.

వాస్త‌వానికి హిందు సంప్ర‌దాయ ప్ర‌కారం కాబోయే అల్లడు కాళ్ల‌ని  మామ‌గారు క‌డ‌గాలి... ఆ నీళ్ల‌ని అత్త‌గారు అల్లుడు కాళ్ల‌పై పోయాలి. కానీ న‌య‌న్ పెళ్లిలో ఆ స‌న్నివేశం మిస్ అయింది. దీంతో ఆ బాధ్య‌త‌లు వేరొక‌రు నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో  పెళ్లి  న‌యన‌తార త‌ల్లికి ఇష్టం లేక రాలేద‌ని సందేహాలు వ్య‌క్త‌మ‌వ్వ‌డం స‌హ‌జం.

కానీ ఇక్క‌డ అలాంటి సన్నివేశం లేదు. వివాహం అనంత‌రం దంప‌తులిద్ద‌రు కేర‌ళ‌లోని ఓమ‌న్ కురియ‌న్ ఇంటికెళ్లి ఆశీర్వ‌చ‌నాలు పొందారు. అయితే ఓమ‌న్ హాజ‌రు కాక‌పోవ‌డానికి కార‌ణాలు అనేకం కావొచ్చు.  వాటిలో ప్ర‌ధానంగా  హిందు సంప్ర‌దాయ ప్ర‌కారం జ‌రిగిన పెళ్లి కాబ‌ట్టి ఓమ‌న్  అనాస‌క్తి చూపించి ఉండొచ్చు. స‌హ‌జంగా ఈ రెండు మాత‌ల మ‌ధ్య పెళ్లిళ్లు కుద‌ర‌వు.

మ‌తమే అక్క‌డ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. మ‌తానికి విరుద్దంగా జ‌రిగే  పెళ్లిళ్ల‌కు మ‌త పెద్ద‌లు హాజ‌రు కారు. ఆ లెక్క‌లోనే ఓమ‌న్ కురియ‌న్ పెళ్లిలో క‌నిపించ‌లేదు. న‌య‌న‌తార త‌ల్లి-తండ్రి తరుపు కుటుంమంతా క్రైస్త‌వులే. న‌య‌న‌తార అదే మ‌త  ఆచారాల‌ ప్ర‌కారం పుట్టి పెరిగింది. చిన్న వ‌య‌సులోనే బాప్తిస్తం తీసుకుంది.  ప్రేమించిన మ‌నిషి కోసం మ‌తం మార్చుకుందిప్పుడు.
Tags:    

Similar News