అందాల నయనతార - విఘ్నేష్ శివన్ ప్రేమాయణం గురించి తెలిసిందే. ఆ ఇద్దరూ త్వరలోనే పెళ్లికి రెడీ అవుతున్నారని తామరతంపరగా మీడియాలో ప్రచారం సాగుతూనే ఉంది. ఈ ఏడాదిలోనే పెళ్లి ఉంటుందని ఇటీవలే తమిళ మీడియాలో మరోసారి వార్తలొచ్చాయి. అయితే దేనినీ ఈ జంట అధికారికంగా కన్ఫామ్ చేయడం లేదు. పెళ్లి మాటేమో గానీ.. ప్రస్తుతం ఫ్రెంచి రివెరా (ఫ్రాన్స్)లో జరుగుతున్న కేన్స్ 2019 ఉత్సవాల్లో ఈ ప్రేమపక్షులు పార్టిసిపేట్ చేయడం అభిమానుల్లో చర్చకు వచ్చింది. మే 14న మొదలైన ఈ ఉత్సవాలు మే 25తో ముగుస్తున్నాయి. ఆ క్రమంలోనే ఇలా సౌత్ నుంచి కేన్స్ కి వెళ్లిన తొలి జంటగా నయన్ - విఘ్నేష్ పాపులరయ్యారు.
తాజాగా కేన్స్ వేదిక నుంచి విఘ్నేష్ స్వయంగా కొన్ని ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి తన ఆనందం వ్యక్తం చేశారు. అక్కడ తన ఫేవరెట్ డైరెక్టర్ క్వెంటిన్ టారంటినోని కలిశాడు. అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. తన పేరు కూడా అతడికి చెప్పాడట. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో చెప్పుకుని సంబరపడిపోతున్నాడు. ఇటీవలే తన ఫేవరెట్ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ తో కలిసినప్పుడు ఇంతే ఆనందం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
నేడు కేన్స్ ఉత్సవాల్లో క్వెంటిన్ టారంటినో దర్శకత్వం వహించిన `వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్` అనే సినిమా ప్రీమియర్ ని ప్రదర్శించనున్నారు. 6 నిమిషాల నిడివితో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన వీడియోని రెడీ చేశారట. ఈ సినిమాని వీక్షిస్తానని విఘ్నేష్ చెప్పారు. ``ఆయనతో కలిసి నడవడం .. షేక్ హ్యాండివ్వడం.. మాట్లాడడం అంతా కలలా ఉంది`` అంటూ విఘ్నేష్ తెగ ఉబ్బి తబ్బిబ్బయిపోతున్నాడు. మొత్తానికి కేన్స్ ఉత్సవాల ఆద్యంతం నయన్ - విఘ్నేష్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారని అర్థమవుతోంది. 2020లో శివకార్తికేయన్ హీరోగా విఘ్నేష్ ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రిపరేషన్స్ లో ఉన్నారు. ఈలోగానే నయన్ నటిస్తున్న అరడజను క్రేజీ చిత్రాలు రిలీజ్ లతో వేడెక్కించబోతున్న సంగతి తెలిసిందే.